cbi confirms manager fraud activities to 3.5 crores ఖాతాదారులకు బ్యాంకు మేనజర్ కుచ్చుటోపి..

Nadarguda bank scam cbi confirms manager fraud activities to 3 5 crores

Bank manager fraud, krishna Aditya, bank customers, bank, CBI, SBI, Bank of India, Hyderabad, Nadarguda, telangana, crime

CBI investigationg the Nadarguda Bank scam confirms the bank manager krishna aditya fraud activities amounted to Rs. 3.5 crores in bank of India.

ఖాతాదారులకు బ్యాంకు మేనజర్ కుచ్చుటోపి.. రూ.3.5 కోట్ల మోసం

Posted: 12/29/2018 01:35 PM IST
Nadarguda bank scam cbi confirms manager fraud activities to 3 5 crores

తిన్నింటి వాసాలు లెక్కబెట్టేవాళ్లు అన్న నానుడికి ఈ బ్యాంక్ మేనేజర్ నిజం చేశాడు. తాను మేనేజరుగా విధులు నిర్వహిస్తున్న బ్యాంకులోనే తెలివిగా ఖాతాదారుల అకౌంట్లకు కన్నాలు వేశాడు. తన తెలివితేటలన్నీ ఉపయోగించి.. కోట్లు రూపాయలను సోంతం చేసుకునే ప్రణాళికలను రచించి తూచా తప్పకుండా అన్నింటినీ అచరణలోనూ సాధ్యం చేశాడు. ఎంతటి మొనగాడైనా.. మోసం చేస్తే చట్టానికి చిక్కుతాడన్న విషయం మాత్రం తెలుసుకోలేక కటకటాలను లెక్కబెడుతున్నాడు.

ఈ ఘటన హైదరాబాద్ లో పరిధిలోని నాగర్‌గూడ ఎస్బీఐ బ్యాంకులో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా నాగర్ గూడ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మేనేజర్‌ ఎన్‌.కృష్ణఆదిత్య తన తెలివితేటలతో తనకు అన్నం పెట్టిన బ్యాంకునే ఏకంగా మూడు కోట్ల రూపాయలను ముంచేశాడు. వివరాల్లోకి వెళ్తే.. బ్యాంకు మేనేజర్ కృష్ణఅదిత్య తాను బ్రాంచ్ మేనేజరుగా పనిచేస్తున్న బ్యాంకులో.. తన పేరిట సేవింగ్‌ ఖాతా తెరిచాడు. తన స్నేహితుడు నీరటి కృష్ణయ్య పేరుపై రూ.9 లక్షలతో ఓవర్‌ డ్రాఫ్ట్‌(ఓడీ) అకౌంట్‌ తెరిచాడు.

ఈ బ్యాంకు పరిధిలో ఉన్న 77 మంది ఖాతాదారుల అకౌంట్ల నుంచి డబ్బులను ఆన్ లైన్‌ ద్వారా సేవింగ్‌ ఖాతాలోకి బదిలీ చేసుకోవడంతోపాటు ఓడీ అకౌంట్ పై రూ.92 లక్షలు బ్యాంకు నుంచి బదిలీ చేశాడు కృష్ణఆదిత్య. 77 అకౌంట్లతో 24 మంది ఖాతాదారుల అనుమతి లేకుండా కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా డబ్బులను తన సేవింగ్‌ ఖాతాలోకి మళ్లించినట్టు అంతర్గత విచారణలో బయటపడింది.

ఇంటితోనే ఇతగాడి మోసాలు ఆగలేదు. 53 మంది పేర్లతో తప్పుడు ధ్రువపత్రాలు పెట్టి బ్యాంకు ఖాతాలు తెరిచాడు కృష్ణఆదిత్య. వీళ్ల ఖాతాలపై రూ.62 లక్షలను రుణాల పేరిట దండుకున్నాడు. గ్రూప్‌ ఆఫ్‌ కస్టమర్ల పేరుతో 11 మందికి అర్హత లేకున్నా క్రెడిట్‌ రుణాలు మంజూరు చేసి బ్యాంకుకు నష్టం వచ్చేలా చేసినట్టు ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారం ఓ ఖాతాదారుడి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.

తనకు సమాచారం లేకుండా తన అకౌంట్‌ నుంచి రూ.2 లక్షలను డ్రా చేసి కృష్ణఆదిత్య తన అకౌంట్లో వేసుకున్నాడని ఓ ఖాతాదారుడు ఫిర్యాదు చేశాడు. అసలు ఇలా ఎలా జరిగిందని ఆరా తీసిన ఉన్నతాధికారులు... ఇతగాడి మోసాల చిట్టి చూసి విస్తుపోయారు. దీనిపై సీబీఐకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సీబీఐ కృష్ణ ఆదిత్య మొత్తం రూ.3.46 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్టు గుర్తించింది. అతడితో పాటు అతడికి సహకరించిన మరికొందరు ఉద్యోగులపై కేసులు నమోదు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bank manager fraud  krishna Aditya  bank customers  bank  CBI  SBI  Bank of India  Hyderabad  Nadarguda  telangana  crime  

Other Articles