'Glass Tumbler' symbolizes equality to Pawan's fans జనసేన పార్టీ గుర్తుపై పవన్ కల్యాణ్ హర్షం..

Glass tumbler symbolizes equality to pawan s fans

pawan kalyan, janasena, Pawan Kalyan glass tumbler, election commission, party symbol, andhra pradesh, politics

The Election Commission of India has assigned Glass Tumbler as the symbol of Jana Sena Party. As far as Pawanists are concerned, Glass Tumbler is 'mass'. It symbolizes equality and transparency.

జనసేన పార్టీ గుర్తుపై పవన్ కల్యాణ్ హర్షం..

Posted: 12/24/2018 11:23 AM IST
Glass tumbler symbolizes equality to pawan s fans

తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎన్నికల రణక్షేత్రంలోకి దిగుతున్న జనసేన.. ఓ వైపు తన పార్టీని బలోపేతం చేసుకుంటూనే.. మరోవైపు ఎన్నికల సమరానికి కూడా సిద్దమవుతోంది. గత ఎన్నికలకు మునుపే పవన్ కల్యాణ్ నేతృత్వంలో పార్టీని స్థాపించి.. అటు టీడీపీని ఇటు బీజేపిలకు మద్దతునిచ్చారు. అయితే ఈ రెండు పార్టీలో కూడా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన రెండు హామీలను నెరవేర్చలేదన్న వాస్తవాన్ని గ్రహించారు. నిలదీసినా సమాధానం రాకపోవడంతో అందోళన కార్యకరమాలను కూడా చేపట్టారు.

అంతటితో ఆగకుండా తనను నమ్మిన ప్రజలకు అండగా నిలిచేందుకు.. రాజకీయ రణక్షేత్రం బరిలోకి దిగారు. ప్రశ్నించేందుకే మాత్రమే తాను పార్టీని పెట్టినా.. పారదర్శకత, ప్రజలకిచ్చిన హామీలకు పార్టీలు, ప్రభుత్వాలు కట్టుబడి లేకపోవడంతో తానే నేరుగా, రాజకీయాంగా ప్రజల పక్షాన నిలుస్తున్నాయని ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన పార్టీకి ఎన్నికల సంఘం గాజు గ్లాసును గుర్తుగా ప్రకటించింది. దీంతో జనసేన కార్యకర్తలలో పారదర్శకపాలనకు, జవాబుదారి తనమని తమ అధినేత చెప్పిన విధంగానే తమకు ఎన్నికల గుర్తు కూడా వచ్చిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం విదేశాల్లో పార్టీకి చెందిన కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్.. ఈసీ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. తమకు గ్లాసు గుర్తును కేటాయించిన ఈసీకి జనసేనాని పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. తన చిన్నతనం నుంచి గాజు గ్లాసుతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని ఆయన ట్విట్టర్ ద్వారా చెప్పారు. మన దేశంలోని సాధారణ పౌరుడి గుర్తింపు కూడా ఇదేనని అన్నారు. అ సందర్భంగా గాజు గ్లాసు ఫొటోను అప్ లోడ్ చేశారు. మరోవైపు, గాజు గ్లాసు గుర్తుపై జనసేన కార్యకర్తలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles