Ap ruling TDP party calls for protest on Jan 1 జనవరి 1న నిరసన ర్యాలీలకు అధికార పార్టీ పిలుపు

Andhra pradesh ruling tdp party calls for protest on jan 1

Andhra Pradesh, special status, new year celebrations, protest, agitations, rallies, BJP, PM Modi, TDP, ap politics

The ruling TDP government in Andhra pradesh calls for protest demanding special status on new year day 1. chandrababu calls youth to stop celebrations and instead protest demanding special status.

జనవరి 1న నిరసన ర్యాలీలకు అధికార పార్టీ పిలుపు

Posted: 12/24/2018 11:36 AM IST
Andhra pradesh ruling tdp party calls for protest on jan 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికలకు ముందు అన్యాయం జరిగిన రాష్ట్రమంట అంగలార్చిన ప్రధాని నరేంద్రమోడీ.. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు పూర్తైయినా హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని.. పార్లమెంటు సాక్షిగా అందోళనలు చేపడుతున్నా.. సమావేశాలను స్థంభింపజేస్తున్నా.. కనీసం కేంద్రంలోని ప్రభుత్వం స్పందించడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రజలు మరీ ముఖ్యంగా యువత.. రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

యువత చేపట్టే నిరసనలు చూసి రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ, దానికి సహకరిస్తున్న ఇతర పార్టీల గుండెల్లో వణుకు పుట్టేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సర రోజున వేడుకలకు బదులు నిరసనలు, ర్యాలీలతో కేంద్రం దిగివచ్చేలా.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు అర్థమయ్యేలా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జనవరి 1న రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ భారీగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

సాధారణంగా కొత్త సంవత్సరం రోజున సంబరాలు చేసుకుంటామని, అయితే, కేంద్రం చేసిన అన్యాయంపై ఈసారి జనవరి 1న గళమెత్తాలని సూచించారు. రాష్ట్రం నుంచి గ్రామ స్థాయి వరకు ప్రజలు కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ఎవరికి వీలైన సమయంలో వారు రెండు మూడు కిలోమీటర్ల మేర  నిరసన ర్యాలీలు నిర్వహించాలని కోరారు. అయితే, ఇది పార్టీల పరంగా కాకుండా ప్రజలే ముందుకొచ్చి ర్యాలీలు నిర్వహించాలని కోరారు.

రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ర్యాలీలు నిర్వహించాలని చంద్రబాబు కోరారు. తొలుత ఒకరు నిరసన తెలిపితే వారి వెంట కలిసి వచ్చే వాళ్లు మరికొందరు ఉంటారని, అలా అది ప్రవాహంగా మారుతుందని అన్నారు. అన్యాయం జరుగుతున్నా చూస్తూ కూర్చుంటే పదేపదే అదే మోసానికి గురి  కావాల్సి వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  special status  new year celebrations  protest  agitations  rallies  BJP  PM Modi  TDP  ap politics  

Other Articles