Assembly seats in Telugu states to stay unchanged అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం క్లారిటీ

Assembly seats in telangana ap to stay unchanged till 2026

Telugu Desam Party,Telangana,N. Chandrababu Naidu,Hansraj Gangaram Ahir, Andhra Pradesh, National, Union Home Ministry, politics

Union minister of state for home Hansraj Gangaram Ahir told the Rajya Sabha that it was not feasible to increase the number of Assembly seats .

తెలుగురాష్ట్రాల అసెంబ్లీస్థానాల పెంపు సాధ్యంకాదు: కేంద్రం

Posted: 12/20/2018 06:58 PM IST
Assembly seats in telangana ap to stay unchanged till 2026

రాష్ట్ర పునర్విభజనలో పేర్కోన్నట్లు అసెంబ్లీ స్థానాల పెంపుపై గత ఐదేళ్లుగా ఇటు తెలంగాణ, అటు అంధ్రప్రదేశ్ లోని రాజకీయ పార్టీలు పెట్టుకున్న ఆశలు అడియాశలే కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదని తాజాగా కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 170 (3)వ అధికరణం ప్రకారం 2021 జనాభా లెక్కల ప్రకారమే అసెంబ్లీ సీట్ల పెంపు ఉంటుందని కేంద్రం పేర్కొంది.

2014లో రాష్ట్ర పునర్విభజన సందర్భంగా బిల్లులో రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు కూడా ఉంటుందని పేర్కోందిజ అయితే ఈ హామీ కూడా ఆంధ్రప్రధశ్ ప్రత్యేక హోదా హామీ మాదిరిగానే మిగిలిపోనుంది. ఈ మేరకు రాజ్యసభలో ఎంపి సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం అసెంబ్లీ స్థానాల పెంపు ఇప్పట్లో సాధ్యపడదని లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.

రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీ స్థానాలను పెంచాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. ఏపిలో 175 నుంచి 225కు, 119 నుంచి 153కు పెంచాలని పొందుపరిచారు. మరోవైపు విభజన చట్టంలోని 12వ షెడ్యూల్‌ అంశాలన్నీ దాదాపు అమలులోకి తెచ్చామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు మరో ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్‌ అడిగిన ప్రశ్నకు కూడా కేంద్రం ఇదే సమాధానమిచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  Telangana  Chandrababu Hansraj Gangaram Ahir  Andhra Pradesh  National  politics  

Other Articles