hello Train 18: Country's fastest train శతాబ్ది రికార్డును తిరగరాయనున్న ట్రైన్-18

Goodbye shatabdi train 18 services to start from 29 december

train 18, train 18 launch, train 18 inauguration, indias' fastest train, indian railways, engineless train, narendra modi, varanasi

Train 18, the fastest from railways’ stable that will replace Shatabdi trains, is likely to be flagged off by Prime Minister Narendra Modi on December 29 from his constituency Varanasi.

శతాబ్ది రికార్డును తిరగరాయనున్న ట్రైన్-18

Posted: 12/20/2018 04:39 PM IST
Goodbye shatabdi train 18 services to start from 29 december

దేశంలో అత్యంత వేగంగా వెళ్లే రైలు ఏదంటే ఏడవ తరగతి విద్యార్థి కూడా శతాబ్ది ఎక్స్‌ప్రెస్ అని ఠక్కున చెబుతాడు. అలాంటి ఈ రైలు రికార్డు త్వరలో కనుమరుగు కానుంది. అందేలా అంటే.. శతాబ్ది కన్న వేగంగా ప్రయాణించే రైలు మరో తొమ్మిది రోజుల తరువాత సేవలందించేందుకు సిద్దంకానుంది. అదే తొలి ఇంజిన్ రహిత రైలు కూడా కావటం గమనార్హం. ‘ట్రైన్ 18’ డిసెంబరు 29 నుంచి పట్టాలపై పరుగులు పెట్టనుంది.

మేకిన్ ఇండియాలో భాగంగా చెన్నైలోని ఐసీఎఫ్ లో పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ‘ట్రైన్ 18’ను తయారుచేశారు. దీనికి రూ.100కోట్ల ఖర్చయింది. బోగీతో పాటే ఇంజిన్ కలిసి ఉండటం దీని ప్రత్యేకత. అందుకే దీన్ని దేశీయ తొలి ఇంజిన్‌లెస్ ట్రైన్‌గా పిలుస్తున్నారు. ట్రయల్ రన్‌లో భాగంగా ఇది గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. ప్రస్తుతం దేశంలో శతాబ్ది ఎక్స్‌ప్రెస్ మాత్రమే అత్యధిక వేగంతో ప్రయాణిస్తోంది.

1988లో ప్రారంభమైన ఈ రైలు దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ 20 మార్గాల్లో ప్రయాణిస్తోంది. ‘ట్రైన్ 18’ రంగ ప్రవేశంలో శతాబ్ది హైస్పీడ్ రికార్డు కనుమరుగు కానుంది. అప్ డేటెడ్ టెక్నాలజీతో రూపొందించిన ‘ట్రైన్ 18’లో ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. ఉచిత వైఫై, జీపీఎస్ టెక్నాలజీతో ఎప్పటికప్పుడు స్టేషన్ల సమాచారం అందజేయడం, బయో వాక్యూమ్ టాయిలెట్స్, ఎల్‌ఈడీ లైట్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, బయటి వాతావరణాన్ని బట్టి ఉష్ణోగ్రతలు అడ్జస్ట్ చేయడం వంటి సదుపాయాలు ఉన్నాయి.

ఇందులో 52 సీట్ల సామర్థ్యంతో రెండు ఎగ్జిక్యూటివ్ కోచ్‌లు ఉన్నాయి. మిగతావన్నీ ట్రైలర్ కోచ్‌లే. ఎగ్జి్క్యూటివ్ కోచ్‌లో సీట్లను 360 డిగ్రీల కోణంలో ఎటైనా తిప్పుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో 29న రైలును ప్రారంభించనున్నారు. ఇది రోజూ ఢిల్లీ-వారణాసి మధ్య ఎనమిది గంటల వ్యవధిలో ప్రయాణించనుంది. కాగా, దేశవ్యాప్తంగా రైలు చార్జీలను విపరీతంగా పెంచిన మోదీ సర్కార్.. తమ నియోజకవర్గానికి ట్రైన్ 18ను, తన గుజరాత్ కు బుల్లెట్ ట్రైయిన్ నడుపుకుంటున్నారన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles