School teacher elopes with class 10 student పెళ్లైన టీచర్.. పదో తరగతి విద్యార్థితో పరార్..

School teacher elopes with class 10 student in selam of tamil nadu

student, 10th class student, teacher, teacher elopes with student, married teacher elopes with student, thiruvagoundanur, selam, tamil nadu, Crime

A 26-year-old private school teacher, who got married to a software engineer a month back, eloped with her 15-year-old student, says she want to stay with the student in thiruvagoundanur of selam in Tamil Nadu

నెల రోజుల కిందట పెళ్లైన టీచర్.. పదో తరగతి విద్యార్థితో పరార్..

Posted: 12/20/2018 05:14 PM IST
School teacher elopes with class 10 student in selam of tamil nadu

విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే దారితప్పుతున్నారు. వక్రమార్గం పట్టిన విద్యార్థులను సక్రమమార్గంలో పెట్టి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తమపై వుందన్న ఇంకితాన్ని మర్చిపోతున్న ఉపాధ్యాయులు విద్యార్థునులతో ప్రేమాయణాలు నెరుపుతూ.. వారితోనే ఉడాయించి వార్తల్లో వ్యక్తులుగా మారుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా తయారవుతున్నారు.

తాజాగా చెన్నైలోని ఓ ఉపాధ్యాయురాలు కూడా అదే పని చేసింది. అమె వయసు 26 సంవత్సరాలు. సేలం, తిరువాగౌండనూరుకు చెందిన అమె తన స్వస్థలంలోని ఓ ప్రైవేటు స్కూల్ లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమెకు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో నెల రోజుల క్రితమే వివాహం జరిగింది. అయితేనేం అనుకుందో ఏమోగాని, తాను విద్యను బోధించే పదో తరగతి విద్యార్థితో కలసి ఆమె పరారైంది. ఆపై పోలీసులను ఆశ్రయించి, తామిద్దరం కలిసే ఉంటామని చెప్పడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, భర్త చెన్నైలో ఉద్యోగం చేస్తుండటంతో, వివాహమైన వారం తరువాత అతను వెళ్లిపోగా, ఆమె పుట్టింటికి వచ్చింది. సోమవారం మధ్యాహ్నం ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ దాకా వెళ్లి వస్తానని చెప్పిన ఆమె, తిరిగి రాకపోవడంతో, పలు చోట్ల గాలించారు. ఇక చివరకు అన్ని చోట్ల వెతికిన కుటుంబ సభ్యులు మంగళవారం పోలీసులును ఆశ్రయించారు. ఈ క్రమంలో బాలుడితో సహా స్టేషన్ కు వచ్చిన ఆమె, విద్యార్థితోనే ఉంటానని చెప్పడంతో, ఇద్దరి తల్లిదండ్రులనూ పిలిపించిన పోలీసులు, కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 10th student  teacher  elopes  thiruvagoundanur  selam  tamil nadu  Crime  

Other Articles