Traffic cop dragged on car's bonnet in Gurugram ట్రాఫిక్ పోలీసుపై మందుబాబు జులుం..

Watch gurgaon man tries to flee traffic police drags officer on bonnet

drunkard, traffic police, dragged, cars bonnet, drunk and driving, wrong side drive, Signature Tower Chowk, traffic violations, Gurugram, Haryana, crime

Traffic cop was dragged for around 100 metres by a man who was stopped by the cops for driving on the wrong side near Signature Tower Chowk in Gurugram

ITEMVIDEOS: దేశరాజధానిలో ట్రాఫిక్ పోలీసుపై మందుబాబు జులుం..

Posted: 12/20/2018 03:40 PM IST
Watch gurgaon man tries to flee traffic police drags officer on bonnet

తప్పతాగిన ఓ మందుబాబు, తన వాహనానికి అడ్డుగా ఉన్న ట్రాఫిక్ పోలీసును దాదాపు 200 మీటర్ల దూరం ఈడ్చుకుంటూ వెళ్లాడు. విధులను సక్రమంగా నిర్వహించే ట్రాఫిక్ పోలీసులపై తన బడాబాబునని జులుం చేసేందుకు యత్నించాడు. తప్పతాగి తప్పుడుదారిలో కారు నడిపి.. అడ్డుకున్న కానిస్టేబుల్ నే హతమర్చే చర్యలు చేపట్టాడు. ఎట్టకేలకు ఈ బడాబాబును పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

న్యూఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్ సమీపంలోని సిగ్నేచర్ టవర్ చౌక్ వద్ద ఈ ఘటన జరిగింది. రాంగ్ రూట్ లో వస్తున్న ఓ కారును ట్రాఫిక్ పోలీసు ఆపగా, వాహనదారుడు ఆపకుండా వెళ్లేందుకు ప్రయత్నించాడు. సరైన మార్గంలో వెళ్లాలని పోలీసుల చేసిన సూచన ఆయనకు రుచించలేదు. కారును అలా పోనివ్వాలని చెప్పిన ట్రాఫిక్ పోలీసు మాటలను లక్ష్యపెట్టకుండా కారును వెనక్కి తీసుకుని అదే తప్పుడు దారిలో స్పీడుగా వెళ్లాలని భావించాడు.

దానిని కూడా కానిస్టేబుల్ అడ్డుకోవడంతో.. అతనిపైకి వాహనాన్ని ఎక్కించాలని చూశాడు. కారు బాయినెట్ ను కానిస్టేబుల్ గట్టిగా పట్టుకోగా, కారును దౌడు తీయించాడు. దాదాపు 200 మీటర్ల దూరం కారు వెళ్లింది. ఈలోగా మరో వాహనదారుడు ఆ కారుకు అడ్డుగా తన కారును తీసుకెళ్లడంతో మందుబాబు దొరికిపోయాడు. అతన్ని అరెస్ట్ చేశామని, కారును సీజ్ చేశామని పోలీసులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Traffic cop  police  traffic violations  Signature Tower Chowk  Gurugram  Haryana  crime  

Other Articles