Child trafficking racket busted, 5 held అమ్మకానికి ఆడశిశువు.. అరవై వేలకు ఖరీదు..

Child trafficking racket busted 5 held

Child trafficking, North 24 Parganas district, arrest, police custody, judicial custody, Kolkata, crime

Five persons, including the owner of a private nursing home in North 24 Parganas district, were arrested on the charge of being involved in the trafficking of a 11-day-old infant, police said.

అమ్మకానికి ఆడశిశువు.. అరవై వేలకు ఖరీదు..

Posted: 12/17/2018 04:46 PM IST
Child trafficking racket busted 5 held

అమ్మాయిల ట్రాఫికింగ్ రాకెట్ కు సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెగిన పేగు బంధం అరకముందే ఆడశిశువును తల్లికి దూరం చేసి అరవై వేల రూపాయలకు అమ్మకానికి పెట్టిన ప్రైవేట్ నర్సింగ్ హోమ్ తో పాటుగా బిడ్డను కొన్న జంటను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అమ్మాయిలను విదేశాలకు తరలించే ట్రాఫికింగ్ ముఠాతో చేతులు కలిపిన నర్సింగ్ హోమ్ ను సీజ్ చేసేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు.

పశ్చిమబెంగాల్ లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హబ్రా ఆసుపత్రికి పదిరోజుల పదికందును తీసుకుని వచ్చిందో జంట. ఆ ఆడశిశువు అనారోగ్యంగా ఉండడంతో బర్త్ సర్టిఫికెట్ చూపించాలని కోరారు వైద్యులు. అయితే వారి దగ్గర అలాంటివేమో లేకపోవడం.. అస్పత్రివర్గాలు అడిగిన ప్రశ్నలకు ఆ జంట వేర్వేరు సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు.

దీంతో భారీ ట్రాఫికింగ్ రాకెట్ గుట్టురట్టైంది. హబ్రాలోని అశోక్ నగర్ ఏరియాలో ఉన్న ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో పుట్టిన పిల్లలను ట్రాఫికింగ్ ద్వారా వేరే ప్రాంతాలకు చేరవేస్తున్నట్టు తేల్చారు. ఆ నర్సింగ్ హోమ్ నుంచి తీసుకున్న బిడ్డకు అనారోగ్యం కలగడంతో హబ్రా ఆసుపత్రికి వచ్చినట్టు తేలింది. అప్పుడే పుట్టిన మరో ఆడబిడ్డను రూ. 60వేల రూపాయలకు అమ్మేందుకు బేరం కుదుర్చుకున్నట్టు తేల్చారు.

శిశువు తల్లిదండ్రులుగా నటిస్తూ ఈ జంట పసికందును అసుపత్రికి తీసుకువచ్చారు. అయితే శిశువు తల్లిదండ్రులు ఎవరన్న విషయాన్ని మాత్రం పోలీసులు కనుగొనలేకపోయారు. దీంతో ప్రైవేట్ నర్సింగ్ హోమ్ యాజమాన్యానికి చెందిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు నర్సింగ్ హోమ్‌లో కేర్ టేకర్‌గా విధులు నిర్వహిస్తున్న మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర అమ్మకానికి ట్రాఫికింగ్ ద్వారా తెచ్చిన 11 రోజుల చిన్నారిని శిశు సంరక్షణా కేంద్రానికి తరలించారు పోలీసులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles