actor Aswathy Babu arrested for possession of drugs డ్రగ్స్ కేసులో సినీనటి అరెస్టు..

Malayalam tv film actress aswathy babu held with ecstasy tablets

Aswathy babu, Malayalam actor, drugs case, TV actor, Kochi, driver binoy abraham, bengaluru, drugs, MDMA, kochi, kerala police, crime

Malayalam film and television actor Aswathy Babu was arrestedfrom Thrikkakara at Kochi in Kerala for being in possession and attempting to sell illegal drugs.

మాదకద్రవ్యాల కేసులో సినీనటి అరెస్టు..

Posted: 12/17/2018 03:01 PM IST
Malayalam tv film actress aswathy babu held with ecstasy tablets

మలయాళ నటి అశ్వతీ బాబును కేరళా పోలీసులు మాదకద్రవ్యాలను కేసులో రెడ్ హ్యండెండ్ గా పోలీసులకు దొరికిపోయింది. తమకు అందిన సమాచారంతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు అమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అశ్వతీ బాబుతో పాటు.. అమె కారు డ్రైవర్ బినాయ్ అబ్రహాంకూడా వున్నారు. ఓ కస్టమర్ కు మాదక ద్రవ్యాలను రవాణచేస్తుండగా అమెను కోచిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ మేరకు త్రిక్కకర పోలీసు స్టేషన్ కు చెందిన పోలీసు అధికారి ధృవీకరించారు. ఎండీఎంఏ అనే సింథటిక్ డ్రగ్‌ను ఓ కస్టమర్‌కు చేరవేస్తున్న సమయంలో పోలీసులకు పట్టుబడ్డట్టు పోలీసు అధికారి తెలిపారు. నటీ అశ్వతీ బాబుని, ఆమె డ్రైవర్ ను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. దానికి సంబంధించిన దర్యాప్తు జరుగుతుందన్నారు. అయితే ఆమె నివాసంలో కూడా పోలీసులు తనిఖీల నిర్వహించారు.

అమె నివాసంలో కూడా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచరంతో ఆమె ఇంటిలో తనిఖీలు చేశారు. ఇక ప్రాథ్యమిక విచారణలో నటి డ్రైవర్ అబ్రహాం బెంగుళూరు నుంచి అమెకు మాదకద్రవ్యాలను తీసుకువచ్చి ఇస్తుంటారని కూడా తెలిసిందని పోలీసులు చెప్పారు. ఇక వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు డ్రగ్స్ కేసులో ముఠా మొత్తాన్ని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారని తెలుస్తుంది. అశ్వతీ బాబు కొన్ని మలయాళ సిరీయల్స్ తో పాటు సినిమాలల్లో కూడా నటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aswathy babu  Malayalam  TV actor  Kochi  driver binoy abraham  drugs  MDMA  

Other Articles