No kissing contest for couples in jharkhand చుంభన ప్రియులకు చేదువార్త.. పోటీలకు బ్రేకులు..

No kissing contest for tribal couples in jharkhand this year

Kissing Competition, Controversial Contest, Talpahari village, Tribals, jmm mla, Simon Marandi, BJP, modernity in tribals, Jharkhand, jharkhand kissing competition, kissing contest, politics

The controversial kissing competition held among the tribals have been banned. A senior Jharkhand MLA had courted controversy by holding a kissing contest to promote modernity in the state last year.

ITEMVIDEOS: అదర చుంబన ప్రియులకు షాక్.. పోటీలకు బ్రేకులు..

Posted: 12/17/2018 05:17 PM IST
No kissing contest for tribal couples in jharkhand this year

గిరిజన భార్యభర్తల మధ్య ప్రేమ, ఆప్యాయతలు పెంపెందించేందుకు స్వయంగా స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించే అదర చుంబన పోటీలపై అభ్యంతరాలు పైచేయి సాధించాయి. రసిక ప్రియులకు ఎంతో ప్రీతిపాత్రమైన ముద్దులపోటీలు ఎక్కడో పాశ్య్చాత దేశల్లో నిర్వహించడం అంతగా అభ్యంతరాలు వుండకపోవచ్చు.. కానీ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసే భారతావనిలోని జార్ఖండ్ రాష్ట్రంలో ఇవి జరగడం అధికసంఖ్యలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

రాష్ట్రంలోని పాకూర్ జిల్లాలో జరిగే ముద్దుల వేడుక ఇది. ఊర్లలో జాతరలు, వేడుకలు జరిగినప్పుడు జనాలకు పోటీలు పెట్టి, అహ్లాదపర్చడం సర్వసాధారణమే. లిట్టిపరా గ్రామంలో జనాలను ఉర్రూతలూగించే ఉద్దేశంతో అదర చుంబక పోటీలను పెట్టారు నిర్వాహకులు. కొన్నాళ్ల నుంచి ఇక్కడ సాంస్కృతిక నృత్యాలు, ఆర్చరీ, పరుగు పందెం వంటి పోటీలుపెడుతున్నా... గత ఏడాది అదర చుంబన పోటీలు నిర్వహించారు నిర్వాహకులు.

స్వయంగా ఈ ప్రాంత జేఎంఎం సీనియర్ ఎమ్మెల్యే సిమోన్ మరండి నేతృత్వంలోనే ‘లిప్ లాక్ కిస్ కాంటెస్ట్’ నిర్వహించడం విశేషం. ఈ పోటీలలో పాల్గొనే జంటలు అదరచుంబనాలు పెట్టుకుంటూ తమకు నిర్ధేశించిన గమ్యాలకు చేరుకుని తిరిగి రావాల్సి వుంటుంది. చుంబనం చేసుకుంటూ త్వరగా గమ్యాన్ని చేరుకున్నవాళ్లే విజేతలు. అయితే ఈ పోటీలో ఖచ్చితంగా భార్యభర్తలే పాల్గొనాల్సి వుంటుంది. గత ఏడాది నిర్వహించిన ఈ పోటీలకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో సంచలనంగా మారాయి.

దీంతో ఈ తరహా పోటీలను వ్యతిరేకించే వారు పెరిగారు. ఈ తరహా పోటీలను నిర్వహించే నిర్వాహకులు ఎన్ని చెప్పినా.. ఇది భారతీయ సంస్కృతీ కాదని, ఇలాంటి పోటీలను నిషేధించాలని బీజేపి కూడా అభ్యంతరాలను తెలిపింది. దీంతో ఈ ఏడాది ఈ ముద్దుల పోటీ నిర్వహణకు అడ్డంకి ఏర్పడింది. అభ్యంతరాల నేపథ్యంలో పోలీసులు ఈ పోటీలకు అనుమతి ఇవ్వకపోవడమే కారణం. దీనిపై స్పందించిన బీజేపి ఇది భారతీయ సంస్కృతి విజయంగా పేర్కోన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kissing Competition  Controversial Contest  Tribals  jmm mla  Simon Marandi  Jharkhand  politics  

Other Articles