Bogus votes of 4.93 lakh removed: Rajath Kumar ఎన్నికలకు సర్వం సిద్దం: సీఈఓ రజత్ కుమార్

We made all arrangement for telangana elections rajath kumar

Rajath kumar, Chief Election officer, Seri Lingampally, Badrachalam, Hyderabad, Telangana, Telangana Election 2018, Telangana politics

A total of 4.93 lakh bogus voters has been removed ahead of Telangana assembly elections, said Rajath Kumar. Speaking at 'meet the press',

ఎన్నికలకు సర్వం సిద్దం: సీఈఓ రజత్ కుమార్

Posted: 12/03/2018 07:26 PM IST
We made all arrangement for telangana elections rajath kumar

రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 2,80,64,684 మంది ఓటర్లు వున్నారని వారిలో పురుషులు 1,41,56,182, మహిళలు 1,39,05,811, ఇతరులు 2,691 వున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తంగా నాలుగు లక్షల 93 వేల బోగస్ ఓట్లను తొలగించామని చెప్పారు. రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు వున్న నియోజకవర్గంగా శేరిలింగంపల్లి వుండగా, భద్రాద్రి జిల్లా అత్యల్పంగా ఓటర్లు వున్నారని తెలిపారు.

శేరిలింగంపల్లిలో 5,75,541 మంది ఉండగా.. భద్రాద్రి నియోజకవర్గంలో అత్యలంగా 1,37,319 మంది ఓటర్లున్నారు. అత్యధిక పురుష ఓటర్లు శేరిలింగంపల్లిలో 3,07,348 మంది, భద్రాచలంలో అత్యల్పంగా పురుష ఓటర్లు 66,604 మంది ఉన్నారు. అత్యధిక మహిళా ఓటర్లు కుత్బుల్లాపూర్ లో 2,41,064 మంది, అత్యల్ప మహిళా ఓటర్లు భద్రాచలంలో 70,691 మంది ఉన్నారని ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా నమోదైన మొత్తం కేసులు 6858 కాగా 4967 పరిష్కరించబడ్డాయి. 1708 కేసులు తొలగించబడగా, మరో 183 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. మొత్తంగా హైదరాబాద్ లో 895 ఫిర్యాదులు, మేడ్చల్, మల్కాజ్‌గిరిలో 663 ఫిర్యాదులు నమోదయ్యాయి. అత్యల్పంగా 56 కేసులు వికారాబాద్‌లో నమోదయ్యాయి. అత్యంత తీవ్రమైన 3155 కేసుల వివరాలు పోస్టర్లు, బ్యానర్ల ద్వారా ప్రచురితమయ్యాయి. డబ్బుల పంపిణీకి సంబంధించి 206కేసులు నమోదయ్యాయి.

ఇక, మొత్తం వికలాంగ ఓటర్లు 4,57, 809 మంది ఉన్నారు. వారిలో చూపులేని వారు 60012 మంది.. చెవుడు కలిగి మాటలురానివారు 50714 మంది ఉన్నారు. పాక్షికంగా చూపులేని వారు 252790 మంది, ఇతర చూపు సమస్యలు కలిగినవారు 95116 మంది ఉన్నారు. వీళ్లందరితో సమన్వయం చేసి పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చేలా.. 31 జిల్లాలకు కో ఆర్డినేటర్లు నియమించింది ఈసీ. 29541 మంది శిక్షణ పొందిన వాలంటీర్లను నియమించింది.

దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లూ చేసింది. ఈ ఎన్నికల్లో మొత్తంగా 55329 బ్యాలెట్ యూనిట్స్, 39763 కంట్రోల్ యూనిట్స్, 42751 వీవీప్యాట్స్, 238 మంది సభ్యుల చొప్పున అన్ని జిల్లాలకు 31 ఇంజినీరింగ్ టీమ్స్ ఏర్పాటు చేయడంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారులను నియమించింది ఎలక్షన్ కమిషన్.

25 నియోజకవర్గాల్లో 15 మంది అభ్యర్థులు, 78 నియోజకవర్గాల్లో 16 నుంచి 31 మంది అభ్యర్థులు, 16 నియోజవర్గాల్లో 32 మందికి పైగా అభ్యర్థులు, 25 నియోజకవర్గాల్లో 15మంది వరకు అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు మొత్తంగా 1821 అభ్యర్థులు బరిలో ఉండగా.. అత్యధికంగా మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో 42 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యల్పంగా బాన్సువాడలో 6గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీల నుంచి 515 మంది పోటీ చేస్తుండగా, స్వతంత్రులుగా 1306 మంది బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ తరపున 99 మంది అభ్యర్థులు బరిలో నిలువగా, బీజేపీ నుంచి 118 మంది, సీపీఐ(ఎం) తరపున 26 మంది, సీపీఐ నుంచి ముగ్గురు, ఎన్సీపీ తరపున 22 మంది, బీఎస్పీ నుంచి 107గురు, టీఆర్ఎస్ నుంచి 119 మంది, టీడీపీ నుంచి 13 మంది, ఎంఐఎం నుంచి 8 మంది ఎన్నికల బరిలో ఉన్నారు.

ఎన్నికల నిర్వహణ భద్రత కోసం 279 ప్లాటూన్ల బలగాలను వినియోగిస్తుస్తోంది ఈసీ. ఇప్పటికే 240 ప్లాటూన్ల బలగాలను కేంద్రం పంపించింది. మరో 39 ప్లాటూన్ల బలగాలు రావాల్సి ఉంది. ఇక, ఎన్నికల డ్యూటీలో 30000 మంది రాష్ట్ర పోలీసులు పాల్గొననున్నారు. 18860 మంది పోలీసులను ఇతర రాష్ట్రాల నుంచి ఈసీ రప్పించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajath kumar  Chief Election officer  Seri Lingampally  Badrachalam  Telangana  

Other Articles