AAP leader assaults eve-teaser అకతాయి తాట తీసీన అప్ నేత

Aap leader allegedly assaults youth for eve teasing

AAP Leader, Assaults, Youth, Delhi, Eve-Teasing, Aam Aadmi Party, national politics

An Aam Aadmi Party (AAP) leader allegedly assaulted a youth with stick in broad daylight in presence of police personnel. The youth was beaten up for allegedly eve-teasing in the area.

ఆకతాయి తాట తీసీన ఆప్ నేత

Posted: 12/03/2018 08:48 PM IST
Aap leader allegedly assaults youth for eve teasing

మిట్టమధ్యాహ్నం వేళ వీదుల్లో అమ్మాయిలను వేధిస్తూ వారిని ఇబ్బందుల పాలు చేస్తున్న ఆకతాయిల తాట తీశారు అక్కడి నేత. ఎవరా నేత అంటే అప్ పార్టీ నేత. ప్రస్తుతం ఆకాతాయి తాట తీస్తున్న ఆయన వీడియో నెట్టింట్లో సంచలనంగా మారింది. పోలీసులు ఎదుటే ఆకతాయిపై ఆయన చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని మరీ దాడి చేశాడు. ఆకతాయి ఓంటిపై నుంచి చోక్కను తీయించిన తరువాత లాఠీతో చితకబాదాడు. ఈ ఘటన దేశ రాజధానిలోని ఢిల్లీలో జరిగింది.

పనిపాట లేకుండా తిరుగుతున్న అకతాయిలు స్థానికంగా ఓ గుంపుగా ఏర్పడి అక్కడి స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తూ.. ప్రశ్నించిన వారిపై ఎదురు తిరుగుతూ నానాయాగి చేస్తున్నారు. స్థానికంగా వుండే అమ్మాయిలను కూడా కామెంట్లు చేస్తూ.. సంఘవిద్రోహశక్తులుగా వ్యవహరిస్తున్నారు. తాము ఎదుర్కోంటున్న ఈ సమస్యపై స్థానికులు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడి దృష్టికి తీసుకెళ్లారు.

వారు వచ్చినప్పుడు తనకు ఫోన్ చేయాలని స్థానికులకు చెప్పిన నేతకు ఫోన్ వచ్చింది. అంతే అక్కడకు చేరుకున్న ఆయన అకతాయిని చితకబాదారు. అయితే చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడంపై మీడియా కథనాలు వస్తున్న క్రమంలో స్థానికులు మాత్రం ఆమ్ ఆద్మీ నాయకుడికి మద్దతిస్తున్నారు. గుండా గర్ధీ ఇక్కడ నడవదని నినదించారు. తమకు అకతాయిలతో నిత్యం ఇబ్బందులు ఎదుర్కోంటున్నామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AAP Leader  Assaults  Youth  Delhi  Eve-Teasing  Aam Aadmi Party  national politics  

Other Articles