Are srinivas goud, satyam the next in lagadapati list శ్రీనివాస్ గౌడ్, సత్యంలకు లగడపాటి ఫోన్.?

Telangana elections 2018 are srinivas goud medipally satyam the next in lagadapati survey list

telangana elections 2018, Telangana assembly elections, Lagadapati rajagopal, kata srinivas goud, medipally satyam, pre poll survey, lagadapati survey, Congress, Maha kutami, Telangana Politics

Former Member of parliament Lagadapati Rajagopal, after his independents win comments, now there are rumours in political circles, that he called up congress youth candidates kata srinivas goud, medipally satyam and appreciated them

లగడపాటి జాబితాలో తదుపరి గెలుపు గుర్రాలు వీళ్లేనా..?

Posted: 12/03/2018 06:19 PM IST
Telangana elections 2018 are srinivas goud medipally satyam the next in lagadapati survey list

తెలంగాణలో డిసెంబర్ నెల 7వ తేదీన జరగనున్న ఎన్నికలలో ప్రజాతీర్పు ఎలా వుండబోతుంది.. ఎవరు గెలుస్తారన్న విషయాలు ఈనెల 11న వెల్లడి కానున్నా అసలు ఒరవడి ఎలా వుంది అన్న అంచనాలు తెలుసుకునేందుకు ప్రీ ఫోల్ సర్వేలవైపు ప్రజలు అసక్తిని కనబరుస్తారు. ఇక ఏ పార్టీకి చెందిన తటస్థ ఓటర్లు రాష్ట్రంలో గెలుపోటములను నిర్ధేశించే స్థాయిలో వున్నారు. వారు కూడా ఈ అంచనాలను చూసే ఆయా అభ్యర్థులు, పార్టీల వైపు మొగ్గుచూపుతారు.

ఇక ఇలాంటి సర్వేలను ఖచ్చితత్వంతో స్పష్టం చేసే రాజకీయ నేతలలో మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కూడా సిద్దహస్తుడు. ఆయన గతంలో వెలువరించిన గణంకాలు రమారమి వాస్తవ రూపం దాల్చడంతో ఆయన అంచనాలకు అటు రాజకీయ వర్గాలతో పాటు ఇటు ప్రజల్లో కూడా మంచి అదరణ వుంది. అయితే ఇటీవల ఆయన తెలంగాణ ఎన్నికలలో ఇండిపెండెంట్లు సత్తా చాటుతారని కూడా ప్రకటించారు.

తెలంగాణ ఎన్నికలలో స్వతంత్రులుగా బరిలో నిలిచిన వారిలో దాదాపు పది మంది గెలుస్తారన్న ఆయన వారిలో నారాయణ పేట్ నుంచి శివకుమార్ రెడ్డి, బోధ్ నుంచి అనీల్ జాదవ్ లు విజయాన్ని అందుకుంటారని కూడా వెల్లడించారు. రోజుకు ఇద్దరు చోప్పున వారి పేర్లను కూడా ప్రకటిస్తానని చెప్పిన ఆయన ఈసీ అధికారుల సూచనల మేరకు మిన్నకుండిపోయారు. అయితే తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వార్త ఇటు నెట్టింట్లో సంచలనంగా మారింది.

ఆయన గెలుపు గుర్రాల జాబితాలో మరో ఇద్దరు వున్నారని వారికి ఆయన ఫోన్ చేసి అభినందించారన్న వార్త కూడా ప్రచారం జరుగుతోంది. అయితే వారిద్దరూ కాంగ్రెస్ తరుపున బరిలో నిలిచిన యువకులేనని కూడా సమాచారం. వారిలో మెదక్ జిల్లా పటాన్ చెరువు కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్, కరీంనగర్ జిల్లా చొప్పదొండి కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యంల పేర్లు వున్నాయని తెలుస్తుంది. అదెలా అంటే వీరికి లగడపాటి రాజగోపాల్ స్వయంగా ఫోన్ చేశారని వారికి అభినందనలు కూడా తెలిపారని సమాచారం.

తన సర్వే వివరాలను వారికి తెలిపిన లగడపాటి రాజగోపాల్.. వారికి ఎన్ని ఓట్లు వస్తాయో కూడా చెప్పారని, సమాచారం. దీంతో, లగడపాటి సర్వేలో మూడో గెలుపు గుర్రం కాటా శ్రీనివాస్ గౌడ్ కాగా నాలుగో గెలుపు గుర్రం మేడిపల్లి సత్యమే అనే చర్చ జోరుగా సాగుంతోంది. దీంతో ఆయా అభ్యర్థుల అనుచరులు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో నిమగ్నమయ్యారు. మరో రెండు రోజుల్లో ముగుస్తున్న ఎన్నికలలో ప్రచారాన్ని తారాస్థాయికి చే్ర్చుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles