Night owls has Greater Risk of Heart Disease అర్థరాత్రిళ్లు నిద్రకు ఉపక్రమిస్తే.. ఈ వ్యాధుల ముప్పు..

Late night sleepers at high risk of heart disease diabetes says study

Better sleep, night owl, late night sleep, heart disease, type-2 diabetes, high risk, study, morning larks, eating patterns, health and well being, circadian rhythm, chronotype, body clock, alcohol, sugars, caffeinated drinks, fast food

If you are a night owl or prefer sleeping late at night and are having trouble waking up early, then you are at a higher risk of suffering from heart disease and Type-2 diabetes than early risers.

మీరు నిషాచరులా.? గుండె, షుగర్ వ్యాధుల భారిన పడే ఛాన్స్ ఎక్కువ

Posted: 12/03/2018 05:09 PM IST
Late night sleepers at high risk of heart disease diabetes says study

అర్థరాత్రిళ్లు టీవీ చూస్తూ ఆలస్యంగా నిద్రకు ఉపక్రమిస్తున్నారా.? లేదా రాత్రిళ్లు నిద్ర ముంచుకోస్తున్నా స్మార్ట్‌ఫోన్‌ వాడటం మీకు అలవాటా? నిద్రకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఫేస్ బుక్, యూట్యూబ్ తో టైమ్ గడిపేస్తుంటారా? ఫోన్, ల్యాప్ టాప్ కాకుండా రాత్రంతా పుస్తకాలతో కుస్తీ పడుతుంటారా? లేక నిద్ర వస్తున్నా అర్థరాత్రిళ్లు స్నేహితులతో కలసి తిరిగే నిషాచరులా.? అయితే మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే. అర్థరాత్రిళ్లు నిద్రకు ప్రాధాన్యత ఇవ్వకుండా మేల్కోని వారికి అనారోగ్య ముప్పు అధికంగా వుంది.

ఇలా చేసేవారికి హృద్రోగ సంబంధిత వ్యాధులతో పాటు చక్కెర వ్యాధి (షుగర్ వ్యాది) బారిన పడే ప్రమాధం అధికంగా వుంది. కూడా అధికంగా గుండెజబ్బుల్ని తీసుకొచ్చేవే. బోనస్‌గా డయాబెటిస్ కూడా వస్తుంది. వామ్మో అనుకోకండి. అర్థరాత్రి వరకు నిద్రపోని వారికి గుండెజబ్బులు, డయాబెటిస్ వచ్చే రిస్క్ ఎక్కువ అని తాజా అధ్యయనాలు తేల్చాయి.

త్వరగా నిద్రపోయి తెల్లవారుజామున నిద్రలేచేవారితో పోలిస్తే... అర్థరాత్రి ఆలస్యంగా నిద్రపోయే వారికి టైప్-2 డయాబెటిస్ వచ్చే రిస్క్ 2.5 రెట్లు ఎక్కువ అన్నది నెస్లే హెల్త్ సైన్స్ పరిశోధకుల అధ్యయనం సారాంశం. రాత్రి ఆలస్యంగా పడుకొని ఉదయాన్నే నిద్రలేచేందుకు ఇబ్బందులు పడేవారికి గుండె జబ్బులు వచ్చే రిస్క్ కూడా ఎక్కువే. అంతేకాదు... వేళాపాళా లేకుండా తినడం, ఫాస్ట్ ఫుడ్, ఆల్కహాల్, స్వీట్స్ ఎక్కువగా తీసుకునేవారికీ ఆరోగ్య సమస్యలు వచ్చే రిస్క్ ఎక్కువ.

ఆలస్యంగా తినడం కూడా టైప్-2 డయాబెటిస్‌కు దారితీస్తుందట. కారణం... సిర్కాడియం రిథమ్ అదుపుతప్పడమే. అందుకే అర్థరాత్రి వరకు మేల్కొనేవాళ్లు నిద్రపోయేముందు తినడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. అది మెటబాలిజంపై ప్రభావం చూపిస్తుంది. అర్థరాత్రి వరకు మేల్కొనేవాళ్లు... వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోయి ఆ లోటును భర్తీ చేయాలని ఆలోచిస్తారట. అది కూడా ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles