tenth class examination scheduled released పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల..

Ap ssc time table 2019 released exam starts from march 18

Tenth Class Exam Schedule, HRD Minister Ganta Srinivasa Rao, AP Tenth Exam Dates, AP Tenth Class Exams, AP Tenth Class Exam Time Table, AP Tenth Class Exam Dates, AP SSC Time Table 2019, 10th class, exam time table, 10 class exam shedule, ganta srinivasa rao, Andhra Pradesh

The Board of Secondary Education of Andhra Pradesh will be conducting the Class 10 examinations from March 18 to April 2, 2019, for the academic year 2018-19.

పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల..

Posted: 12/03/2018 04:17 PM IST
Ap ssc time table 2019 released exam starts from march 18

పదోతరగతి పరీక్షల షెడ్యూల్డు విడుదలైంది. పరీక్షా తేదీలు ఫలితాలు ఎప్పుడు విడుదలయ్యే తేదీలను అంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ వెల్లడించింది, పరీక్షలు ముగిసిన తరువాత గతంలో వున్న 45 రోజుల వ్యవధిని ఈ సారి తగ్గించి కేవలం నెల రోజుల వ్యవధిలోనే పలిథాలను విడుదల చేస్తామని కూడా ఈ సందర్భంగా అంధ్రప్రదేశ్ విద్యాశాఖ వెల్లడించింది. అమరావతిలో మంత్రి ఘంటా శ్రీనివాసరావు ఈ మేరకు పరీక్షల టైమ్ టేబుల్ ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షెడ్యూలు ప్రకారం మార్చి 18 నుంచి 29 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా తేదీల్లో ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబరు 7 వరకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకోనివారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు.

పరీక్షల కోసం ఇప్పటి వరకు మొత్తం 6.10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని.. 2,833 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి గంటా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 91 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలు గుర్తించామని, ఆయా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ప్రధానోపాధ్యాయులు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. పరీక్షలు జరిగిన నెల రోజులకే ఫలితాలను విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

పరీక్షల షెడ్యూలు..

ఫస్ట్ లాంగ్వేజ్- తెలుగు (పేపర్-1)     18-03-2019
ఫస్ట్ లాంగ్వేజ్- తెలుగు (పేపర్-2)     19-03-2019
సెకండ్ లాంగ్వేజ్- హిందీ                20-03-2019
థర్డ్ లాంగ్వేజ్- ఇంగ్లిష్ (పేపర్-1)      21-03-2019
థర్డ్ లాంగ్వేజ్- ఇంగ్లిష్ (పేపర్-2)      22-03-2019
మ్యాథమెటిక్స్ (పేపర్-1)               23-03-2019
మ్యాథమెటిక్స్ (పేపర్-2)               25-03-2019
ఫిజికల్ సైన్స్ (పేపర్ -1)               26-03-2019
బయాలాజికల్ సైన్స్ (పేపర్-2)       27-03-2019
సోషల్ స్డడీస్ (పేపర్-1)                28-03-2019
సోషల్ స్డడీస్ (పేపర్-2)                29-03-2019

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 10th class  exam time table  10 class exam shedule  ganta srinivasa rao  andhra pradesh  

Other Articles