KCR deal with Modi to escape CBI probe: congress మోదీతో ములాఖాత్ అయ్యింది అందుకే: ఉత్తమ్

Telangana cm kcr struck deal with modi to escape cbi probe alleges congress

Telangana CM KCR, CM KCR Modi Deal, ESI case, Uttam Kumar Reddy, L.Ramana, K Chandrasekhar Rao, BJP, TRS, Telangana, POlitics

The alliance alleged that KCR had struck a deal with the Centre to strike his name off a CBI chargesheet pertaining to the ESI scam.

సీబీఐ చార్జీషీటు నుంచి కేసీఆర్ పేరు అదృశ్యమైందెలా.?: ఉత్తమ్

Posted: 12/01/2018 04:00 PM IST
Telangana cm kcr struck deal with modi to escape cbi probe alleges congress

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రంలోని అధికార బీజేపి ప్రభుత్వాన్ని చూసి ఎందుకు జంకుతున్నారన్న విషయాన్ని కాంగ్రెస్ ఎట్టకేలకు బట్టభయలు చేసింది. కేంద్రంలోని అధికార బీజేపితో తెరవెనుక అంటకాగుతూనే తైరపై మాత్రం తాము ఎవరితో కలిసేది లేదని గాంభీర్యాలకు పోవడం అంతా బీజేపి అడిస్తున్న డ్రామానేనని కాంగ్రెస్ అరోపించింది. సింహమంటూ డైలాగులు కొడుతున్న కేటీఆర్ తన తండ్రి విషయంలో నిజానిజాలను కూడా ప్రజలకు తెలియజేయాలని ప్రజాకూటమి డిమాండ్ చేసింది.

తాజాగా నిర్వహిచిన మీడియా సమావేశంలో టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఈఎస్ఐ స్కాంలో అప్పటి కేంద్ర మంత్రిగా ఉన్న కేసీఆర్ పేరు సీబీఐ నమోదుచేసిన చార్జిషీట్లో ఉందని, ఇప్పుడు అదెలా మాయమైందని ప్రశ్నించారు. నరేంద్రమోదీతో లాలూచీపడిన కేసీఆర్.. తన పేరును చార్జ్ షీట్ నుంచి తప్పించారని ఉత్తమ్ ఆరోపించారు. యూపీఏ 1 హయాంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్ర కార్మికశాఖ మంత్రిగా పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఈఎస్ఐ కార్పొరేషన్ ద్వారా నిర్మించాల్సిన మెడికల్ కాలేజీ బిల్డింగ్ పనులను, నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌కు కాకుండా వెలుగుబంటి సూర్యనారాయణ అనే వ్యక్తి ద్వారా మత్స్యశాఖకు అప్పగించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దీనికి సంబంధించి అవినీతి ఆరోపణలు రావడంతో సీబీఐ కేసు నమోదు చేసిందని తెలిపారు. ఆ కేసులో సీబీఐ దాఖలు చేసిన పత్రాల్లో.. ఈఎస్ఐ అధికారులను ఇంటికి పిలిపించుకుని మరీ కేసీఆర్ కాంట్రాక్టును కట్టబెట్టినట్టు తెలిపిందన్నారు.

దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేసిందన్నారు. సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్లో కేసీఆర్ పేరు ఉండగా, ఇప్పుడు ఆ కేసు నుంచి కేసీఆర్ పేరు తప్పించినట్టు ఉత్తమ్ ఆరోపించారు. నరేంద్రమోదీతో కుమ్మక్కు కావడం వల్లే ఇలా కేసు నుంచి తప్పించారన్నారు. మోదీతో లాలూచీ పడిన తెలంగాణ సీఎం.. రాష్ట్రానికి రావాల్సిన వాటిని కూడా సరిగా పట్టించుకోలేదని చెప్పారు.

మరోవైపు కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే బీడీ కట్టల మీద పుర్రె గుర్తు వచ్చిందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. కేసీఆర్ వల్లే లక్షలాది మంది బీడీ కార్మికులకు నష్టం వాటిల్లిందన్నారు. సహారా సంస్థకు రూ.7000 కోట్ల పీఎఫ్ నిధులు వాడుకునేందుకు కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు అనుమతి ఇచ్చారని, ఇది భారీ కుంభకోణమని ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటికే టీఆర్ఎస్ రూ.1000 కోట్లు ఖర్చు చేసిందన్న రమణ.. రాబోయే రోజుల్లో మరో రూ.1000 కోట్లు ఖర్చు చేస్తుందని సందేహం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles