raghuveera comments on rahul-chandrababu meet రాహుల్-చంద్రబాబు సభపై రఘువీరా కామెంట్స్..

Raghuveera reddy comments on rahul gandhi chandrababu khammam public meet

APCC President, raghuveera reddy, rahul gandhi, chandrababu, TDP, Congress, Andhra Pradesh, politics

Andhra Pradesh Congress Commitee president Raghuveera Reddy says it took 24 hours to comeout of Rahul gandhi-Chandrababu joint public meet in khammam.

రాహుల్-చంద్రబాబు సభపై రఘువీరా కామెంట్స్..

Posted: 12/01/2018 03:16 PM IST
Raghuveera reddy comments on rahul gandhi chandrababu khammam public meet

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ప్రజాకూటమి అధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో తమ అఖిలభారత అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలసి సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతొలిసారి కలుసి సభావేదికను పంచుకున్న సందర్భంగా తాను షాక్ కు గురయ్యానని అంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సంచలన కామెంట్లు చేశారు. ఈ షాక్ నుంచి తేరుకునేందుకు తనకు ఒక రోజు పట్టిందని ఆయన తనదైన శైలిలో కామెంట్లు చేశారు.

రాష్ట్రంలో ఏ పార్టీ అయినా ఒంటరిగా పోటీ చేస్తే 40-50 సీట్లు కూడా రావని, అందుకనే చంద్రబాబు రాహుల్ ను కలిశారని పేర్కొన్నారు. అనంతపురంలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన రఘువీరా.. రాహుల్ గాంధీ నిర్ణయమే తమకు శిరోధార్యమన్నారు. ఆయన నిర్ణయాన్ని తామందరం గౌరవించి.. దానికి కట్టుబడి ఉంటామన్నారు. అయితే జాతీయ స్థాయిలో దేశ ప్రయోజనా నిమత్తమే రాహుల్ చంద్రబాబుతో చేయి కలిపారని ఆయన వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్ లో మరో నాలుగైదు నెలల్లో రానున్న సార్వత్రిక ఎన్నికలలో కూడా తాము అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి వుంటామని ఆయన చెప్పారు. టీడీపీతో పొత్తు అంశాన్ని కూడా రాహుల్‌కే వదిలేస్తున్నట్టు చెప్పారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలో ఒంటరిగా ముందుకెళ్లేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని రఘువీరారెడ్డి తెలిపారు. కాగా తెలంగాణలో ప్రజాకూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందని అన్నారు. సోనియాగాంధీ, రాహుల్ వచ్చిన తరువాత ప్రజల్లో వారికి అధికారం అందించాలని బలంగా వుందన్నారు.

ఇక కేసీఆర్ తన ద్వందనీతికి ఆయన చేసిన వ్యాఖ్యలు నిదర్శమని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సందర్బంలో తెలంగాణ తల్లి అంటూ ప్రశంసించిన నోరే.. మూటలు అందడం లేదని అవేదనకు గురవుతున్నారా.. అందుకే మీ కడుపు తరుక్కుపోతుందా.? అని వ్యాఖ్యలు చేయడం ఆయన అధికార దాహానికి పరాకాష్ట అని రఘువీరా రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజానికానికి ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రత్యేకరాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ తోనే న్యాయం జరిగింది, జరుగుతుందని కూడా రఘువీరారెడ్డి పేర్కోన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : APCC President  raghuveera reddy  rahul gandhi  chandrababu  TDP  Congress  Andhra Pradesh  politics  

Other Articles