kcr angry for questioning 12% quota to muslims ముస్లిం రిజర్వేషన్ పై ప్రశ్నిస్తే.. కేసీఆర్ గరం..

Kcr loses cool on voter for questioning on his previous poll promise

telangana elections 2018, Telangana Electtions, kcr poll promise on muslim 12% quota, kcr loses cool, kcr angry, KCR, TRS Public Meet, !2% Reservation, minorities, asifabad, sirpur khagaznagar, suicide attempt, nerella, ktr, assembly elections, telangana politics

CM KCR losses his coolness amid his busy sheduled public meetions in sirpur khagaznagar of Asifabad district, when an voter question on previous poll promise of getting 12% quota to muslims

ITEMVIDEOS: గత ఎన్నికల హామీపై ప్రశ్నిస్తే కేసీఆర్ గరం.. కేటీఆర్ సభలో కలకలం

Posted: 12/01/2018 04:52 PM IST
Kcr loses cool on voter for questioning on his previous poll promise

ITEMVIDEOS: గత ఎన్నికల హామీపై ప్రశ్నిస్తే కేసీఆర్ గరం.. కేటీఆర్ సభలో కలకలంనిండు సభలో ఎవరో ఒకరు గొల చేయడంతో సభకు హాజరైన వారంతా చెల్లాచెదురయ్యే అవకాశం వుండటంతో బహిరంగ సభల్లో ఎవరైన తమను ప్రశ్నిస్తే.. వారిని టార్గెట్ గా చేసుకుని నేతలు అదే అంశాన్ని చెబుతాం అంటూ సముదాయించడం పరిపాటే. అయినా వినకపోతే.. అతన్ని పట్టించుకోవడం మానేస్తారు. అయితే అది ఎన్నికల వేళ.. గత ఎన్నికలలో ఇచ్చిన హామీని ఓటర్లు ప్రశ్నించినప్పుడు పరిస్థితి ఎలా వుంటుందన్న విషయం.. అందులోనూ కేసీఆర్ కే ఈ పరిస్థితి ఎదురుకావడం చర్చనీయాంశంగా మారింది.

ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ ఎన్నికల ప్రచార సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వింత అనుభవం ఎదురైంది. ఆయన ప్రసంగిస్తుండగా.. ప్రేక్షకుల నుంచి ఓ యువకుడు లేచి గత ఎన్నికలలో ‘‘మైనారటీలకు 12 శాతం కోటా ఇస్తామని హామి ఇచ్చారు. మరీ ఈ విషయంలో గత నాలుగేళ్లుగా ఏం చేశారు?’’ అని ప్రశ్నించాడు. దీంతో అతని వైపు అలాగే చేస్తూ వుండిపోయిన కేసీఆర్.. సహనం కోల్పొయి.. నోర్మూసుకుని కూర్చో అంటూ ఆ యువకుడిని తిట్టిపోశారు.  

‘‘బాత్ కర్తే, బైఠో.. కామోష్ బైఠో. వోహీ బారాహ్ పర్సెంట్ హై బోలే కామోష్ బైఠో... బైఠ్ జావో.. తుహ్మారే బాబ్ కు బోలుం క్యా.. (ఏం మాట్లాడుతున్నావు. నోరు మూసుకుని కూర్చో. ఆ 12 శాతం గురించే చెబుతున్నా. నోరు మూసుకుని కూర్చో. నేను చెబుతా, ఎందుకు తొందరపడుతున్నావు? చెప్పానా.. కూర్చో. నీ తండ్రికి చెబుతా.. ఏం మాట్లాడుతున్నావ్’’ అంటూ విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక తమ గెలుపుకు అవసరమయ్యే ప్రతీ అస్త్రాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకుంటున్న ప్రజాకూలమి.. మైనారిటీల ఓట్లను తమ వైపుకు అకర్షించుకునేందుకు ఈ వీడియోను వాడుకుంటోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ‘‘ఇంత కుసంస్కారమా? ప్రశ్నలడిగితే అవమానిస్తవా? ప్రజలు నీ పనోళ్ళా ముఖ్యమంత్రి కుర్చీలో నిన్ను కూర్సో బెట్టినందుకు సిగ్గుబడుతున్నది తెలంగాణ’’ అని కామెంట్ చేసింది.

ఇక మరోవైపు నేరళ్లలో జరిగిన కేటీఆర్ సభలో యువకులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడటంతో కలకలం రేగింది. రెండేళ్ల క్రితం జరిగిన నేరేళ్ల ఘటనలో తమకు న్యాయం చేయకపోగా.. పోలీసులు తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆవేదన వ్యక్తం చేస్తూ బాధితులు బర్తు బానయ్య, కోల హరీశ్‌ ఆత్మహత్యకు యత్నించారు. తమతో పాటు తెచ్చుకున్న కిరోసిన్‌ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకోబోయారు. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకుని తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఈ ఘటనతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. కేటీఆర్ సభలో కలకలం.. నేరేళ్ల బాధితుల ఆత్మహత్యాయత్నం తెలంగాణ మంత్రి కేటీఆర్ పాల్గొన్న బహిరంగ సభలో యువకులు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొన్నారు. సభ జరుగుతున్న సమయంలో నేరేళ్ల ఘటన తాలూకు బాధితులు ఆత్యహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  TRS Public Meet  !2% Reservation  minorities  asifabad  sirpur khagaznagar  telangana politics  

Other Articles