PSLV-CA Takes Off Successfully With 31 Satellites విజయవంతమైన పీఎస్ఎల్వీ-సి43 ప్రయోగం..

Isro s pslv launches 31 satellites including from australia malaysia

Spacecraft, Spaceflight, Earth observation satellites, Satellite, HySIS, Planet Labs, Indian Space Research Organisation, Australia, Columbia, v.jagannathan@ians.in, satellite mission spread, Malaysia, Chairman, French Guiana, optical imaging chip, earth

India on Thursday put into orbit its own Hyper Spectral Imaging Satellite (HysIS) -- an earth observation satellite and 30 other foreign satellites in text-book style from Australia and malaysia. India has till date has put into orbit 269 foreign satellites.

31 శాటిలైట్లను నిర్ణీత కక్ష్యలోకి చేర్చిన పీఎస్ఎల్వీ-సి43

Posted: 11/29/2018 01:29 PM IST
Isro s pslv launches 31 satellites including from australia malaysia

భారత ఇవాళ ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ-సి43తో మరో మైలురాయిని సాధించింది. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఇవాళ్టి ప్రయోగం విజయవంతమైంది. దీంతో విదేశాలకు చెందిన దాదాపు 269 ఉపగ్రహాలను భారత్ నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఘనత భారత్ సొంతమైంది. దీంతో విదేశాలకు చెందిన 250 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన మైలురాయిని భారత్ ఇస్రో అధిగమించింది.

గురువారం ఉదయం సరిగ్గా 9.59 గంటలకు పీఎస్‌ఎల్వీ-సి43 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఒక స్వదేశీ ఉపగ్రహంతోపాటు అమెరికా, కెనడా, కొలంబియా, మలేషియా తదితర ఎనమిది దేశాలకు చెందిన 30 ఉపగ్రహాలను ఈ రాకెట్ ద్వారా పంపారు. పీఎస్ఎల్వీ ద్వారా నాలుగు దశల్లో ఈ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ప్రయోగానికి సంబంధించి బుధవారం ఉదయం 5.59 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 28 గంటలపాటు నిరంతరాయంగా కొనసాగిన అనంతరం రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

పీఎస్ఎల్వీ రాకెట్ నిర్దేశించిన సమయానికి విజయవంతంగా మూడు దశలను దాటుకుంటూ కక్ష్యలోకి ప్రయాణించింది. పీఎస్‌ఎల్వీ-సి43 ద్వారా మన దేశానికి చెందిన హైపవర్‌ స్పెక్ట్రల్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహాన్ని కూడా విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. దాదాపు 2 గంటల తర్వాత పీఎస్ఎల్వీ సీ43 స్వదేశీ హైపరసానిక్ ఉపగ్రహాన్ని సూర్య సమస్థితి కక్ష్యలోని 630 కిలోమీటర్ల ఎత్తున, మిగతా 30 విదేశీ ఉపగ్రహాలను 540 కిలోమీటర్ల ఎత్తున రెండు దశల్లో నిలుపుతుంది.

వాస్తవానికి హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ఇస్రో తొలిసారిగా 2008 మేలో ప్రయోగించింది. సుమారు 83 కిలోల బరువైన ఈ ఉపగ్రహా ప్రయోగాన్ని చంద్రయాన్-1 తర్వాత నిర్వహించింది. ప్రస్తుతం మా రాకెట్లో అమెరికాకు చెందిన 23 ఉపగ్రహాలు, ఆస్ట్రేలియా, కెనడా, కొలంబియా, ఫిన్‌లాండ్‌, మలేషియా, నెదర్లాండ్స్‌, స్పెయిన్‌లకు చెందిన ఒక్కొక్క ఉపగ్రహం ఉన్నాయి. విదేశీ ఉపగ్రహాల మొత్తం బరువు 261.5 కిలోల బరువు కాగా, వీటిలో ఒక మైక్రో, 29 నానో ఉపగ్రహాలు ఉన్నాయి.

వీటిని పీఎస్ఎల్వీసీ 43 రాకెట్ ద్వారా వేర్వేరు కక్ష్యల్లో ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు రాకెట్‌లోని నాలుగో దశ ఇంజిన్‌ను రెండుసార్లు మండించారు. స్వదేశీ ఉపగ్రహం హైచ్‌వైఎస్ఐఎస్ బరువు 380 కిలోలు. ఈ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రధాన విభాగం అహ్మదాబాద్‌ స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ డిజైన్ చేయగా, చండీగఢ్‌లోని సెమికండక్టర్‌ ల్యాబ్‌లో తయారుచేశారు. నింగిలో 630 కిలోమీటర్ల దూరం నుంచి భూమిపై రంగురంగుల చిత్రాలను తీయగల ఈ ఉపగ్రహం వ్యవసాయం, అటవీ, తీర ప్రాంతాల అంచనా, ఇతర భౌగోళిక పరిసరాలకు సంబంధించి వివిధ రకాల సేవలను అందించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shriharikota  pslvc43 rakcet  K Sivan  hysis satellite  

Other Articles