Tamil film actress riyamika suicide death తమిళ సినీ నటి రియామిక ఆత్మహత్య

Tamil film actress hangs herself at her residence

Tamil film actress suicide, Tamil film and TV actress Riyamika, Tamil film actress riyamika suicide, riyamika, prakash, suicide, film actress hangs herself, kollywood film actress suicide, kollywood, crime

A 26-year-old Kollywood actress committed suicide at her house in Valasaravakkam. The reason for her suicide is yet to be ascertained. She didn’t leave any suicide note at her house, police said

ఆత్మహత్యకు పాల్పడిన తమిళ సినీ నటి రియామిక

Posted: 11/29/2018 12:13 PM IST
Tamil film actress hangs herself at her residence

కొలీవుడ్ కు చెందిన వర్దమాన సినీనటి రియామికా ఆత్మహత్యకు పాల్పడింది. చెన్నైలోని వలసారవాకంలోని తాను నివాసముంటున్న అద్దె ఇంట్లోనే నటి రియామికా ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. పలు తమిళ చిత్రాల్లో నటించిన రియామిక, కుద్రతైల్ కుమారాం కొందత్తం, అఘోరి యనిట్టం ఆరంభం సినిమాల్లో కథానాయికిగా మెప్పించారు. సీనియర్ నటి శ్రీదేవి చెందిన కుప్పాం నుంచి వచ్చిన రియామిక కాలీవుడ్ లో ప్రేక్షకులను మెప్పించింది.

ఆ తరువాత టీవీ సీరియల్స్ లోనూ బాగా రాణిస్తుంది. తన సోదరుడు ప్రకాశ్‌తో కలిసి గత నాలుగు నెలలుగా వలసారవాకంలోని ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన సోదరి రియామికను చివరిసారిగా మంగళవారం ఉదయం కలిసినట్టు ప్రకాశ్ తెలిపాడు. అదే రోజు బయటకు వెళ్లిన ప్రకాశ్, తన సోదరికి బుధవారం అనేక సార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో భయపడిన ప్రకాశ్ ఆమె స్నేహితుడు దినేశ్ ను వెంటబెట్టుకుని ఇంటికి వచ్చాడని పేర్కొన్నాడు.

బుధవారం సాయంత్రం ఇద్దరూ ఇంటికి చేరుకునేసరికి లోపలి నుంచి గడియపెట్టి ఉంది. దీంతో తన దగ్గర మరో తాళం చెవితో ప్రకాశ్ తలుపు తెరిచి చూడగా రియామిక తన బెడ్ రూమ్ లో సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. దీనిపై పోలీసులకు సమాచారం అందజేయడంతో వారు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రోయాపెటా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యంకాలేదని, విచారణలో అన్నీ బయటపడతాయని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలు ఎంటో తెలియలేదని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamil actress  riyamikka  actress suicide  Kollywood  crime  

Other Articles