PD Act against brothel organisers angers HC యాదాద్రి వ్యభిచార నిర్వాహకులపై పీడీ యాక్టా.?: హైకోర్టు

Hyderabad hc why issue preventive detention act against yadadri brothel owners

Hyderabad HC, Yadadri brothels, brothel house organisers, Yadadri Preventive Detention Act, Law and Order, crime

Telangana police issuing orders under the Preventive Detention Act against the women running brothel houses in temple town of Yadadri, a division bench of the Hyderabad High Court said that the said activities would fall under the law and order issue.

యాదాద్రి వ్యభిచార నిర్వాహకులపై పీడీ యాక్టా.?: హైకోర్టు

Posted: 11/29/2018 02:52 PM IST
Hyderabad hc why issue preventive detention act against yadadri brothel owners

తెలంగాణ పోలీసుల అత్యుత్సాహంపై హైకోర్టు ధర్మాసనం మండిపడింది. వ్యభిచార నిర్వాహకులపై పీడి యాక్టు పెట్టడాన్ని రాష్ట్రోన్నత న్యాయస్థాన ధర్మాసనం తోసిపుచ్చింది. వ్యభిచారాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించలేమని, అటువంటి కేసులపై పీడీ యాక్ట్‌ ప్రయోగం అర్థరహితమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేరాన్ని పోలీసులు శాంతిభద్రతల కోణంలోనే చూడాలని, అంతేకాని పీడి యాక్డు కింద చూడరాదని పేర్కొంది. దీంతో పోలీసులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

యాదాద్రిలో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న వారిపై పీడి యాక్టు పెట్టడం ఏంటని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. బ్రోతల్ హౌజ్ నిర్వాహకులను పట్టుకుని వారిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించడమేకాక, మహిళలను నిర్బంధించి జైలులో ఉంచడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. చట్టం అమలు చేసేటప్పుడు సహేతుకత పాటించాలని, చట్టం పేరుతో మహిళల జీవించే స్వేచ్ఛను అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని కోర్టు హెచ్చరించింది. అలాగే పోలీసులకు ఏ నేరానికి ఎలాంటి చట్టాల కింద కేసులు నమోదు చేయాలో తెలుసుకోవాలని మండిపడ్డింది.

చిన్నపిల్లల్ని వ్యభిచార కూపంలోకి దింపుతున్నారని ఆరోపిస్తూ యాదాద్రికి చెందిన నలుగురు మహిళలపై పోలీసులు పీడీ యాక్ట్‌ ప్రయోగించి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్‌ చేస్తూ మహిళ తరపున బంధువులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన ధర్మాసనం పోలీసుల తీరును తప్పుపట్టింది. అలజడులు, అశాంతికి కారణమయ్యే తీవ్రమైన నేరాలు జరిగిన సందర్భాల్లోనే నిందితులపై పీడి యాక్డు చట్టాన్ని ప్రయోగించాలని గుర్తు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles