Gurugram rape accused is paedophile serial killer చిన్నారులపై లైంగికదాడి చేసి హత్యచేసే సీరియల్ కిల్లర్ అరెస్టు

Cops fear gurugram rape accused is india s worst paedophile serial killer ever

serial rapist and murderer arrested, India's worst paedophile serial killer, India's paedophile serial killer arrested, Crime against Women, Rape, Rape accused, POCSO, gurugram, gurgaon rape, gurgaon raped accused, Crime

The 20-year-old, Sunil who has been arrested for brutally raping and murdering a three-year-old girl in Gurugram, told police that breaking the girl's leg with a brick before raping her, aroused him.

చిన్నారులపై లైంగికదాడి చేసి హత్యచేసే సీరియల్ కిల్లర్ అరెస్టు

Posted: 11/22/2018 12:50 PM IST
Cops fear gurugram rape accused is india s worst paedophile serial killer ever

మైనర్ బాలికలే ఆ మానవమృగం టార్గెట్. ఎక్కడైనా ఒంటరిగా మైనర్ బాలికలు కనబడితే వారిని అపహరించి, వారిని దారుణంగా హింసించి, తన పశువాంఛ తీర్చుకుంటాడు. తన అకృత్యం ఎవరూ పసిగట్టకూడదన్న కారణంతో వారిని అత్యంత దారుణంగా హతమార్చేస్తాడు. మనిషి రూపంలో వున్న ఈ పైశాచిక మృగాన్ని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ సహా వివిధ ప్రాంతాల్లో రెండేళ్లుగా అభం శుభమెరుగని చిన్నారులపై అకృత్యాలకు పాల్పడుతున్న గురుగ్రామ్ ఉన్మాదిని పోలీసులు అరెస్ట్ చేశారు.

నవంబరు 12న గురుగ్రామ్‌లోని ఓ మురికివాడలో అత్యంత దారుణ స్థితిలో ఉన్న మూడేళ్ల బాలిక మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆ బాలిక కాళ్లు విరగ్గొట్టి, తలను ఛిద్రం చేసి, అత్యాచారం చేసిన తర్వాత, మర్మంగాల్లోకి కట్టెను చొప్పించి అత్యంత హేయంగా హత్యచేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, ఈ కేసును సవాల్ గా తీసుకున్న అధికారులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. నిందితుడు యూపీలోని మహోబా జిల్లా గంజ్‌ గ్రామానికి చెందిన సునీల్‌ (20)గా గుర్తించి, అతడి అరెస్ట్ చేశారు.

విచారణలో నిందితుడు విస్తుపోయిన విషయాలను వెల్లడించాడు. పనీపాటా లేకుండా గాలికి తిరిగే సునీల్ ఎక్కడైనా తిండి దొరుకుతుందా అని ఆబగా ఎదురుచూసేవాడు. ఆశ్రమాలు, ఆలయాల్లో ఆహారం, ప్రసాదాలు పెడితే తినడం, బస్టాపులు, ఫుట్ పాత్ లపై నిద్రపోవడం ఇది అతడి దినచర్య. ఈ క్రమంలో ఎవరైనా బాలికలు కనిపిస్తే వారికి స్వీట్లు, చాక్లెట్లు ఇస్తానని ఆశచూపించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి వారి కాలు విరగొట్టి, తలను పగలుగొట్టేవాడు. ఆ బాధతో చిన్నారులు విలవిలలాడుతుంటే తనకు వారిని అనుభవించాలనే కోరిక కలిగేదని నిందితుడు చెప్పిన మాటలతో పోలీసులు నివ్వెరపోయారు.

నవంబరు 11న బాధిత బాలికను మృగాడు తీసుకెళుతుండగా ఓ హౌసింగ్‌ సొసైటీ వద్ద ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమేరాల్లో నమోదైంది. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత గురుగ్రామ్‌ బస్ స్టేషన్ సమీపంలోను నిందితుడు సంచరించినట్టు సీసీటీవీ కెమేరాలో చిక్కింది. దీంతో, ఈ దృశ్యాలను ఢిల్లీ, గ్వాలియర్‌, ఝాన్సీలకు పంపి, చివరకు మాగార్ పుర్‌ గ్రామంలో నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. నిందితుడ్ని కోర్టులో హాజరుపర్చగా..  న్యాయస్థానం ఎనిమిది రోజుల రిమాండ్ విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rape  Rape accused  POCSO  gurugram  gurgaon rape  gurgaon raped accused  Crime  

Other Articles

Today on Telugu Wishesh