congress rebel supports TDP Anand prasad in Hitech constituency భవ్య ప్రసాద్ కు జైకోట్టిన బిక్షపతి యాదవ్

Congress rebel bikshapathi yadav supports tdp anand prasad in hitech constituency

Hitech constituency, Bikshapathi Yadav, Bhavya Anand Prasad, Seri Lingampally, Telangana Assembly elections, congress, TDP, MahaKutami, Politics

After congress high command and top leaders meet with senior congress leader Bikshapathi Yadav, he withdraws his nomination as rebel from congress and supports MahaKutami TDP Anand prasad in Hitech constituency.

టీడీపీ అభ్యర్థి భవ్య ప్రసాద్ కు జైకోట్టిన కాంగ్రెస్ రెబెల్

Posted: 11/22/2018 01:59 PM IST
Congress rebel bikshapathi yadav supports tdp anand prasad in hitech constituency

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అధికార పార్టీ అంచనాలను క్రమంగా కాంగ్రెస్ అధిష్టానం దూరం చేస్తుంది. మహాకూటమితో పోత్తుపెట్టుకున్న పార్టీలకు రెబల్స్ గుబులు వుంటుందని.. అధికార టీఆర్ఎస్ పార్టీ అంచనా వేసింది. దీంతో కూటమి అభ్యర్థులు పోత్తు పార్టీల రెబల్స్ తో పాటు సొంత పార్టీ రెబెల్స్ కూడా రంగంలోకి దిగడం అధికార పార్టీకి కలిసివస్తుందని కూడా భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ.. కూటమిలో భాగంగా మిత్రపక్షాలకు ఇచ్చింది అధికారికంగా పాతిక సీట్లే అయినా.. తెలంగాణ వ్యాప్తంగా రెబల్స్ గా ఎన్నికల బరిలో మాత్రం సుమారు 40 మంది కాంగ్రెస్ మంది అభ్యర్థులు బరిలో నిలిచారని సమాచారం.

ఇక మిత్రపక్ష పార్టీలు ఈ విషయమై కాంగ్రెస్ అధిష్టానం వద్దకు విషయాన్ని తీసుకెళ్లాయి. మరీ ముఖ్యంగా పొత్తు సజావుగా సాగాలంటే రెబల్స్ ను నియంత్రించాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ తేల్చిచెప్పారు. దీంతో ఏకంగా కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు, సోనియాగాంధీ వ్యక్తిగత సలహాదారు అహ్మద్ పటేట్ రంగంలోకి దిగి అసంతృప్తి నేతలను బుజ్జగించి వారిని ఎన్నికల బరి నుంచి తప్పిస్తున్నారు. అంతేకాదు వారికి పార్టీ అధికారంలోకి రాగానే సముచిత స్థానం కల్పిస్తామని కూడా హామీలు ఇస్తున్నారు.

ఈ క్రమంలో రెబల్స్ తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటున్నారు. పార్టీ ప్రయోజనాలకు కట్టుబడి మహాకూటమి అభ్యర్థులకు మద్దుతు పలుకుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో హైటెక్ అసెంబ్లీ నియోజకవర్గంగా బాసిల్లుతూ.. కీలకమైన శేరిలింగంపల్లిలో రెబల్ గా బరిలోకి దిగిన కాంగ్రెస్ నేత భిక్షపతి యాదవ్ మహకూటమి అభ్యర్థి భవ్య ఆనంద్ ప్రసాద్ కు తన మద్దతు ప్రకటించారు. పార్టీ పెద్దల బుజ్జగింపులతో పోటీ నుంచి తప్పుకున్న బిక్షపతి యాదవ్ ను.. గురువారం కూటమి తరపున బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థి భవ్య ఆనందప్రసాద్‌ కలిశారు.

తనకు మద్దతిచ్చి పూర్తిస్థాయిలో ప్రచారంలో పాల్గొని గెలుపునకు సహకరించాలని అభ్యర్థించారు. దీనికి బిక్షపతి యాదవ్ కూడా తన సహకారం లభిస్తుందని హామీ ఇచ్చారు. అయితే భిక్షపతి యాదవ్ ను బుజ్జగించడానికి ఏకంగా ఆరుగురు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు రంగంలోకి దిగాల్సి వచ్చింది. నేరుగా ఆయన నివాసానికి వెళ్లిన కేంద్ర మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి కలిసినా.. నామినేషన్ ఉపసంహరణకు బిక్షపతి యాదవ్ సమ్మతించలేదు.

దీంతో మళ్లీ బుధవారం రాత్రి ఏఐసీసీ నేత అహ్మద్‌ పటేల్‌, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ, సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ తదితరులు భిక్షపతి యాదవ్‌ ఇంటికి వెళ్లి బుజ్జగించడంతో ఆయన మెత్తబడ్డారు. పొత్తుతో భిక్షపతికి అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని.. భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఇవాళ ఏకంగా టీడీపీ అభ్యర్థి ఆనంద్ ప్రసాద్ కూడా వెళ్లి కలసి.. తన తరపున ప్రచారం నిర్వహించాలని అభ్యర్థించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles