KS Ratnam extreme step to console his rebel venkatswamy చేవెళ్ల రెబల్ అభ్యర్థి వెంకటస్వామి పాదాలపై కేఎస్ రత్నం..

Rebel effect mla contestant pleads his rebel candidate to campaign in his favour

telangana assembly elections, Maha kutami candidates, congress rebels, withdraw nominations, campaign, election chitralu, KS Ratnam, Padala Venkatswamy, congress leader, TRS, Chevella assembly, Telangana Politics

The Photo of mahakutami candidate KS Ratnam is gone viral on social media, where he pleads his party rebel candidate by falling on his feet, to campaign in favour of him for the elections.

చేవెళ్లలో ఎన్నికల సిత్రం: రెబల్ అభ్యర్థి పాదాలపై కేఎస్ రత్నం..

Posted: 11/22/2018 12:16 PM IST
Rebel effect mla contestant pleads his rebel candidate to campaign in his favour

తెలంగాణలో డిసెంబర్ 7న శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు తమ గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మహాకూటమిలో పార్టీల సీట్ల సర్ధుబాటు ఆ తరువాత ఆయా పార్టీలు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థుల ఖారారు చాలా ఆలస్యంగా జరిగింది. దీంతో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం.. రెబెల్స్ గా పలువురు నేతలు కూడా రంగంలోకి దిగడం.. ఆ తరువాత అలకలు.. అధిష్టానం నుంచి దూతలు వచ్చి వారిని సముదాయించడం అన్ని చకచకా జరిగిపోయాయి.

ఇవాళ దాదాపుగా కాంగ్రెస్ రెబెల్స్ గా బరిలోకి దిగిన రమారమి అందరూ నేతలు తమ నామినేషన్లను ఉపసంహరించుకోనున్నారు. అయితే ఇక్కడితే మహాకూటమి అభ్యర్థులకు గెలుపుపై అశలు కలగడం లేదు. రెబెల్స్ గా నేతలు బరిలో నిలవకున్నా.. మహాకూటమి తరపున మాత్రం ప్రచారం చేయడానికి సిద్దంగా లేరు. ఎందుకలా.. అయితే తమ ఇగోను మాత్రం తగ్గించుకోలేకపోతున్నారు. అధిష్టానం చెప్పడంతో బరి నుంచి తప్పుకున్నా.. మరో నేతకు ఓటయ్యామని ప్రజలను ఎలా కోరుతాను అంటూ వారు ఇళ్లకు పరిమితం అవుతున్నారు.

ఈ క్రమంలో టికెట్ దక్కించుకున్న నేతలు తమ కూటమి నేతలను స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి.. వారిని తమకు మద్దుతు ఇవ్వాలని, తమ తరపున ప్రచారం కూడా చేయాలని అర్థిస్తున్నారు. ఇందుకు తాజాగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో జరిగిన ఘటనే ఉదాహరణ. ఈ నియోజకవర్గంలో తనకే పార్టీ టికెట్ దక్కుతుందని పడాల వెంకటస్వామి ఆశించారు. అయితే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అయిన కేఎస్ రత్నంకు హైకమాండ్ చేవెళ్ల టికెట్ ను కేటాయించింది.

ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయాలని తొలుత పడాల వెంకటస్వామి నిర్ణయించుకున్నారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ బుజ్జగించడంతో పోటీ నుంచి ఆయన విరమించుకున్నారు. పోటీ నుంచి తప్పుకున్న పడాల.. ఎన్నకల ప్రచారంలో పాల్గొనడం మానేశారు. ఈ నేపథ్యంలో ఆయన్ను కలుసుకున్న కేఎస్ రత్నం తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా పడాల వెంకటస్వామి కాళ్లకు కేఎస్ రత్నం మొక్కారు. దీంతో ఆయన్ను పడాల లేపి కాళ్లపై పడొద్దని సూచించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం మీడియాలో వైరల్ గా మారాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KS Ratnam  Padala Venkatswamy  congress leader  TRS  Chevella assembly  Telangana Politics  

Other Articles