inebriated woman falls asleep burnt alive మద్యం మత్తులో మహిళ సజీవదహనం

Inebriated woman falls asleep with e cigarette burnt alive

inebriated woman burnt alive, e-cigeratte burns woman, kalpana dies with e-cigeratte, live-in relationship, proffessor krishnapal, kalpana death, indore, madya pradesh

A woman kalpana who is in live-in relationship with a professor krishnapal was in enebriated condition, burnt alive as her e-cigarette, quilt caught fire, death

మద్యం మత్తులో మహిళ సజీవదహనం

Posted: 11/21/2018 04:15 PM IST
Inebriated woman falls asleep with e cigarette burnt alive

మద్యం మత్తు ఎంత పెద్ద ప్రమాదమో ఈ ఘటనతో రుజువైంది. ఫుల్‌గా మద్యం సేవించిన ఓ మహిళ... మత్తులో నిద్రపోయింది. అయితే ఆమె మత్తులో వెలగించుకున్న ఈ- సిగరేట్టే ఆమె ప్రాణం తీసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో చోటు చేసుకుంది. 42ఏళ్ల వివాహితైన కల్పన భర్త పిల్లల్ని వదిలి ప్రొఫెసర్‌తో సహజీవనం చేస్తుంది. ఇండోర్‌లోని పరమ్ విహార్ ప్రాంతంలోని ప్రొఫెసర్ కృష్ణపాల్‌తో కలిసి నివాసముంటుంది.

కల్పనకు మద్యం తాగే అలవాటు ఉండటంతో సోమవారం రాత్రి ఆమె ఫుల్‌గా మందుకొట్టింది. ఆ సమయంలో ఫ్రొఫెసర్ ఇంట్లో లేకపోవడంతో మద్యం... మత్తులోనే నిద్రలోకి జారుకుంది. అయితే.. ఆమె అప్పటికే ఈ-సిగరేట్ కూడా వెలిగించింది. మత్తులో ఉండటంతో ఆ విషయం మరిచింది. ఈ-సిగరేట్ ముందుగా దుప్పటికి అంటుకుంది. మంటలు వ్యాపించాయి. అమాంతం అవి మంచానికి అంటుకున్నాయి.  మద్యం మత్తులో ఉన్న కల్పనకు మంటలంటుకున్న విషయం తెలియలేదు.

దీంతో ఆమె ఆ మంటల్లోనే సజీవదహనం అయ్యింది. ఇంట్లో మంటలు వ్యాపించిన విషయాన్ని ఇరుగుపొరుగువారి గుర్తించి ముందుగా కల్పన ఇంటి తలుపులుతట్టారు. అవి లోపల నుంచిలాక్ చేసి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులకొట్టి చూసేసరికి అప్పుటికే మంటల్లో కల్పన కాలి బూడిదయ్యింది. అక్కడ పడి ఉన్న సిగరేట్ పెట్టెను గుర్తించిన పోలీసులు... ఈ-సిగరేట్ వల్ల ప్రమాదం జరిగినట్లు భావించారు. ఫిర్యాదు అందుకోవడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles