bar council offer rs 1 crore per vote అక్కడ ఓటుకు కోటి రూపాయలు ఆఫర్.!

Chairman aspirants offer rs 1 cr for elected bar council members

andhra pradesh, amaravathi, one vote, rumours, offers, sensational news, Bar council chairman, lawyers, aspirants, elected members, crime

Aspirants of Bar council chairman offer one Crore Rupees for One Vote if elected members select them as Chairman of Bar Council in Andhra Pradesh, Now this had become sensational news.

అక్కడ ఓటుకు కోటి రూపాయలు ఆఫర్.!

Posted: 11/21/2018 05:56 PM IST
Chairman aspirants offer rs 1 cr for elected bar council members

ఓటు అమ్మకూడదు.. అలా అమ్మిన ఓటుకు విలువ మీకు ఐదేళ్ల శాపంగా మారుతుంది అని ప్రజా చైతన్య సంఘాలు, విద్యావంతులు, మేధావులు, ఓటర్లకు సూచిస్తుంటారు. అయితే ఎన్నికల బరిలో నిలబడే అదే విద్యావంతులు, మేధావులు, నిపుణులు గెలుపు కోసం ఎన్ని పాట్లు పడినా తప్పేంకాదంటున్నారు. ఎలా గెలిచామన్నది కాదన్నయ్య.. గెలిచామే లేదా అన్నదే ముఖ్యమంటున్నారు. అందుకు నోట కాదు నోట్ల కట్టలు పంచైనా విజయాన్ని సోంతం చేసుకుని అధికారాన్ని అనుభవించాలని భావిస్తున్నారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల సందర్భంగా ఒక ఓటు కొనుగోలుకు అంత డబ్బు ఆఫర్ చేశారంటూ జరుగుతున్న ప్రచారం సంచలనం సృష్టిస్తోంది. ఇంతకూ ఒక్క ఓటు కోసం వారు ఆఫర్ చేసిన ఆ ధర ఎంతో తెలిస్తే ఎవరైనా దిగ్భ్రాంతి చెందవలసిందే. ఓటుకు రూ. కోటి!...అవునండీ అక్షరాలా ఒక్క ఓటుకు కోటి రూపాయలే. ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ పదవికి తాము చెప్పిన వ్యక్తికి ఓటు వేస్తే రూ.కోటి ఇస్తామని ఆఫర్‌ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం న్యాయవాదుల్లో చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు ఈ ఆఫర్ల ప్రచారంపై ఏకంగా కొందరు సీఎం కార్యాలయానికే ఫిర్యాదులు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఈ వ్యవహారంపై ఏసీబీతో విచారణ జరిపించాలని కొందరు తమ ఫిర్యాదుల్లో కోరారని తెలిసింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన బార్ కౌన్సిల్ ఎన్నికల్లో...మొత్తం 23 వేలమంది న్యాయవాదులు ఓటింగ్ లో పాల్గొని 25 మంది సభ్యులను ఎన్నుకున్నారు. అనంతర దశలో ఈ పాతిక మంది సభ్యులు కలిసి బార్‌ కౌన్సిల్‌ కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ పదవికి భారీ డిమాండ్‌ ఏర్పడినట్లు తెలిసింది. ఇలా బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షునిగా ఎన్నికైన వారికి ఐదేళ్లపాటు పదవీకాలం ఉంటుంది.

బార్ కౌన్సిల్ కు న్యాయవాదుల సంక్షేమ నిధి మంజూరు, న్యాయవాదుల దుష్పవర్తన ఆరోపణలు, న్యాయ కళాశాలలపై పర్యవేక్షణ వంటి పలు అంశాలపై విశేషాధికారాలు ఉంటాయి. ఇదిలావుంటే బార్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా ఒక్క ఓటుకు కోటి రూపాయలు ఆఫర్ చేసినట్లు జరుగుతున్న ప్రచారంపై సాధారణ ప్రజానీకం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. కోటీశ్వరులు కావాలంటే వ్యాపారాలు చేయక్కర్లేదని...ఉద్యోగం చేస్తూ ఏళ్ల తరబడి కూడబెట్టక్కరలేదని...బార్ కౌన్సిల్ లో ఒక్క ఓటు ఉంటే చాలని చర్చించుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amaravathi  one vote  1 crore  sensational news  Bar council chairman  lawyers  aspirants  crime  

Other Articles