will create history with a win on KCR: Prathap reddy కేసీఆర్ పై గెలిచి చరిత్ర సృష్టిస్తా: వంటేరు

Onteru prathap reddy says he will create history with a win on kcr

will create history says onteru prathap reddy, will win on cm kcr says onteru, CM KCR, onteru prathap reddy, Gajwel constituency, gajwel assembly, telangana, politics

Telangana chief minister rival and congress candidate onteru prathap reddy says he will create history with a win on Telangana CM KCR in Gajwel assembly constituency.

గజ్వేల్ లో కేసీఆర్ పై గెలిచి చరిత్ర సృష్టిస్తా: వంటేరు ప్రతాప్ రెడ్డి

Posted: 11/08/2018 11:10 AM IST
Onteru prathap reddy says he will create history with a win on kcr

డిసెంబర్ 7న జరగనున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో తన మామ టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడించమని స్వయంగా హరీష్ రావే వేరే నెంబరు నుంచి తనకు కాల్ చేసి.. చెప్పాడని ఈ విషయంలో తాను దైవ ప్రమాణానికి కూడా సిద్దమని చెప్పి రాష్ట్ర రాజకీయాలలో సంచలనానికి తెరలేపిన గజ్వల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి మరోమారు అసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నకలలో తాను ఖచ్చితంగా చరిత్ర సృష్టిస్తానని చెప్పారు.

సెక్రటేరియట్ కు రాకుండా ప్రగతి భవన్ కు మాత్రమే పరిమితమైన  ముఖ్యమంత్రి కేసీఆర్ ను వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో ఓడించి తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా తన పేరు మిగిలిపోయేలా తాను చరిత్ర సృష్టిస్తానని వంటేరు ప్రతాప్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల తరువాత కేసీఆర్‌ ను కేవలం ఫామ్ హౌజ్ కు మాత్రమే పరిమితం అయ్యేలా చేస్తానని కూడా అన్నారు. కేసీఆర్ పై తనకు చాలా గౌరవం ఉందని, అయితే.. ఆయన పరిపాలనే అధ్వానంగా ఉందని విమర్శించారు. కేసీఆర్‌పైనా, హరీష్‌రావుపైనా తనకు వ్యక్తిగత కక్ష లేదన్నారు. అయితే రైతుల కోసం ఉద్యమించిన తనను వారు రాజకీయంగా దెబ్బతీసేందుకు జైలులో పెట్టారని అన్నారు.

తానెప్పుడూ పేదల పక్షమేనన్న ప్రతాప్‌రెడ్డి వారికి న్యాయం చేయడమే తన లక్ష్యమన్నారు. కేసీఆర్‌పై గెలిచి చరిత్ర సృష్టిస్తానన్న విశ్వాసం తనకు ఉందని అన్నారు. నిజయోజకవర్గంలోనే ఉంటున్నానని, ప్రజలు తనను గెలపిస్తారన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. గజ్వేల్ లో టీఆర్ఎస్ నేతలు ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. బిర్యానీ, బీరు పంపిణీ చేస్తూ ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఇటువంటి వాటికి చెక్ పెట్టాలని వంటేరు డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CM KCR  onteru prathap reddy  Gajwel constituency  gajwel assembly  telangana  politics  

Other Articles