Dharmana name in Vishaka land scam SIT report విశాఖ భూకుంభకోణంలో ధర్మాన పేరు..

Dharmana name in vishaka land scam sit report

vishaka land scam, dharmana prasadarao, janasena party, land scam, AP cabinet meet, nara chandrababu, pawan kalyan, sit report, telugudesam party, visakhapatnam, y.s. jaganmohan reddy, ysr congress party, andhra pradesh, ap politics

A Special Investigative Team submits its Report on Vishaka land scam, which is discussed in cabinet meet for necessary action. It

విశాఖ భూకుంభకోణంలో ధర్మాన పేరు..

Posted: 11/06/2018 08:13 PM IST
Dharmana name in vishaka land scam sit report

విశాఖపట్టణంలోని భూముల కుంభకోణం వ్యవహారంపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు పేరు తెరపైకి వచ్చింది. ఈ భూముల కుంభకోణంలో ఏకంగా 300 మంది అక్రమాలకు పాల్పడినట్లు తేల్చిన సిట్ అందులో రాష్ట్ర మాజీ రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ధర్మాన ప్రసాద్ రావు కూడా వున్నట్లు తేల్చింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు రాజుకున్నాయి. ఈ భూముల కుంభకోణ వ్యవహారంపై విచారణ చేసిన సిట్ నివేదికను సమర్పించింది.

ఈ సిట్ నివేదకను ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముందు ఈ నివేదికను ఉంచారు. విశాఖ భూముల అవకతవకల్లో కొందరు ఐఏఎస్ లు, గ్రేడ్-1 అధికారుల హస్తముందని, కొందరు రాజకీయ నాయకులు, మాజీ మంత్రి ప్రమేయం కూడా ఉందని ఈ నివేదికలో స్పష్టం చేసింది. ఈ నివేదికలో వైసీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరును పేర్కొన్నట్టు సమాచారం. ధర్మాన తనయుడి పేరిట ఉన్న భూముల పైనా సిట్ విచారణ జరిపింది.

మాజీ రెవెన్యూశాఖ మంత్రిగా ధర్మాన ప్రసాద్ రావు వ్యవహరించిన సమయంలో భూముల రికార్డులు ట్యాంపరింగ్ జరిగినట్లు కూడా అధికారులు నివేదికలో పోందుపర్చినట్లు సమాచారం. గతంలో విశాఖ జిల్లాలో పనిచేసిన ముగ్గురు కలెక్టర్లు, నలుగురు జాయింట్ కలెక్టర్లపై అభియోగాలు ఉన్నాయి. సిట్ నివేదికలో 10 మంది  జిల్లా రెవెన్యూ అధికారులు, 14 మంది ఆర్డీవోల పేర్లు ఉన్నాయి. భూ అక్రమాల్లో స్థానిక రాజకీయ నేతల పేర్లను ఈ నివేదికలో పొందుపరిచారు.

100 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని, శాఖపరమైన చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని, కొందరు అధికారులను సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని సిట్ అధికారులు పేర్కొన్నారు. కాగా, పదిహేనేళ్ల భూ లావాదేవీలపై సిట్ విచారణ జరిపింది. ఈ నివేదికపై తదుపరి చర్యలకు ఓ కమిటీని మంత్రి వర్గం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో లా, రెవెన్యూ, జీఏడీలకు చెందిన సెక్రటరీలు ఉంటారని తెలుస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles