EC officials broke locks and check congress party office వరంగల్ లో ఈసీ అధికారుల నిర్భంధం.. కాంగ్రెస్ భారీ ర్యాలీ..

Election officers sudden check at congress party office gheroed by activists

Election officials raids congress party office, election officials warangal party office, election officials gheroed at warangal, election officals, congress activists rally, elections officers, TRS, gheroed, congress party office, congress Rally, congress workers, narsampeta, warangal, telangana, politics

Election officials of Warangal district of Telangana had conducted suddenly raided congress party office breaking the locks and without any information to the congress leaders. This made them anger and locked the officials inside the party office.

వరంగల్ లో ఈసీ అధికారుల నిర్భంధం.. కాంగ్రెస్ భారీ ర్యాలీ..

Posted: 11/08/2018 11:38 AM IST
Election officers sudden check at congress party office gheroed by activists

వచ్చే నెల (డిసెంబర్) 7న జరగనున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అక్రమాలు, అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న తెలంగాణ ఎన్నికల అధికారులు.. అక్కడక్కడా అత్యుత్సాహం కూడా ప్రదర్శించి పార్టీ కార్యకర్తలు చేతుల్లో పరాభవాలను ఎదుర్కోంటున్నారు. మరోలా చెప్పాలంటే అధికార పార్టీకీ కొమ్ముకాస్తూ.. ప్రత్యర్థి పార్టీలను మాత్రం టార్గెట్ చేస్తున్నారని విమర్శలను ఎదుర్కోంటున్నారు. వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి వున్న పట్టు తప్పుతుందని భావించారో ఏమో తెలియదు కానీ అక్కడ ఎన్నికల సంఘం అధికారులు తమ పరిధి ధాటి వ్యవహరించారని కాంగ్రెస్ కార్యకర్తలు అరోపిస్తున్నారు.

వరంగల్ రూరల్ జిల్లాలో ఎన్నికల సంఘం అధికారులు హల్ చల్ చేశారు. ఏకంగా ప్రత్యర్థి పార్టీ కార్యాలయాన్ని వారు టార్గెట్ చేయడం అక్కడి కార్యకర్తల అగ్రహానికి గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని నర్సంపేట పట్టణంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఉదయాన్నే చేరుకున్న అధికారులు కార్యాలయం తాళాలను పగులగొట్టి తనిఖీలు నిర్వహించారు. అయితే పార్టీ కార్యకర్తలు, నేతలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు ఈ చర్యలకు పాల్పడ్డారు. అసలు కనీస సమాచారం ఇచ్చేందుకు కూడా ఎన్నికల సంఘం అధికారులు ఏమాత్రం ప్రయత్నించలేదు.

ఈ విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కార్యాలయంపై దాడి చేసి తనిఖీలు చేస్తున్న అధికారులను వారు నిర్భంధించారు. ఇలా దూకుడుగా వ్యవహరించిన ఫ్లయింగ్ స్వ్కాడ్ చీఫ్ సతీశ్ కాంగ్రెస్ నేతలు తమ పార్టీ కార్యాలయంలోనే నిర్బంధించారు. అధికారులు తమకు సమాచారం ఇవ్వకుండా ఇలాంటి దాడుల పేరుతో వారే అక్రమాలకు పాల్పడి.. తమపై నెట్టే అవకాశం లేకపోలేదని కూడా కాంగ్రెస్ నేతలు అరోపించారు.

అధికార పార్టీ కుట్రలో భాగంగానే ఈ దాడి చోటుచేసుకుందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ప్రతీకార చర్యలు సరికాదని హెచ్చరించారు. అధికార టీఆర్ఎస్ నేతలే ఇందుకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం అధికారుల తీరును నిరసిస్తూ నర్సంపేటలో కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles