key changes in tirumala online seva tickets తిరుమల ఆన్ లైన్ టికెట్ల జారీ విధానంలో కీలక మార్పులు

Key changes in tirumala online seva tickets

Tirumala Tirupathi Devasthanam, TTD Executive Board, Anil singal, key changes, devotees, TTD Online Seva Portal. TTD Seva Portal, one e-mail one phone number, single phone numbers, tirupati updates

Tirumala Tirupathi Devasthanam Executive Board had made key changes in services offering to the devotees providing on Online Seva Portal. TTD Seva Portal to book only single ticket from single e-mail and single phone number.

తిరుమల ఆన్ లైన్ టికెట్ల జారీ విధానంలో కీలక మార్పులు

Posted: 11/02/2018 11:48 AM IST
Key changes in tirumala online seva tickets

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ప్రత్యేక పూజలు చేసుకోవాలని భక్తులు ప్రత్యేక సేవా టికెట్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నా అవి అక్రమార్కుల పాలై అడ్డదారిలో సంపన్న భక్తులకు మాత్రమే దక్కనునండడంతో ఇవాళ జారీ చేసిన ఫిబ్రవరి నెల ఆన్ లైన్ సేవా టికెట్ల నుంచి కీలక మార్పును అమలు చేయనున్నట్టు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఈ సేవ టికెట్ల విధానంలో కీలక మార్పులు అమలు చేయనున్నట్లు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.

ఇప్పటి వరకు వున్న విధానంలో కొంత మార్పులు చేర్పులు చేశారు. ఒక ఈ-మెయిల్, ఒక ఫోన్ నంబర్ నుంచి ఒకే రిజిస్ట్రేషన్ విధానాన్ని నూతనంగా తీసుకు వచ్చామని, ఈ రిజిస్ట్రేషన్ కు ఆధార్ కార్డు వివరాలు తప్పనిసరని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలవుతున్న విధానంలో సేవా టికెట్లు అక్రమార్కుల పాలవుతున్నాయని, పలువురు ఒకే ఫోన్ నంబర్ పై వేర్వేరు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సింఘాల్ వెల్లడించారు. సేవా టికెట్లలో అక్రమాలకు పాల్పడిన భక్తులు, టీటీడీ సిబ్బందిపై క్రిమినల్ కేసులు పెట్టామని ఆయన తెలిపారు.

వచ్చే నెలలో రానున్న వైకుంఠ ఏకాదశికి నవంబర్ 25 నుంచి ఏర్పాట్లు ప్రారంభించనున్నామని భక్తులకు ఇబ్బంది లేకుండా మాడవీధుల్లోనే ఈ దఫా క్యూలైన్ల ఏర్పాటు ఉంటుందని చెప్పారు. మాఢ వీధుల్లో భారీ షెడ్లను ఏర్పాటు చేసి, ప్రశాంత వాతావరణం ఉండేలా చూస్తామని తెలిపారు. డిసెంబర్ 4 నుంచి 12 వరకూ తిరుచానూరులో పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. 12న పంచమీ తీర్థం వేడుక ఉంటుందని తెలిపారు.

ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీనివాసుని ఆర్జిత సేవలకు సంబంధించిన మొత్తం 67,146 టికెట్లను టీటీడీ కొద్దిసేపటి క్రితం ఆన్ లైన్లో విడుదల చేసింది. వీటిల్లో 9,796 టికెట్లను ఆన్ లైన్ డిప్ విధానంలో భక్తులకు అందించనున్నట్టు అధికారులు వెల్లడించారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజపాదదర్శనం టికెట్లు కోరే భక్తులు, శుక్రవారం నుంచి సోమవారం వరకూ రిజిస్టర్ చేసుకోవచ్చని, సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు డిప్ తీసి టికెట్లు పొందిన భక్తుల పేర్లను వెల్లడిస్తామని పేర్కొంది. ఆపై రెండు రోజుల్లోగా వారు నిర్దేశిత మొత్తాన్ని చెల్లించాలని సూచించింది.

7,096 సుప్రభాతం, 110 చొప్పున తోమాల, అర్చన టికెట్లు, 180 అష్టదళ పాదపద్మారాధన, 2,300 నిజపాద దర్శనం టికెట్లను డిప్ తీయనున్నట్టు వెల్లడించింది. ఇదే సమయంలో సాధారణ ఆన్ లైన్ బుకింగ్ విధానం ద్వారా 57,350 టికెట్లను విడుదల చేసినట్టు టీటీడీ పేర్కొంది. వీటిల్లో విశేష పూజకు 2,000, కల్యాణోత్సవం 12,825, ఊంజల్ సేవ 4,050, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,425, సహస్ర దీపాలంకార సేవ 16,200, వసంతోత్సవం 14,850 టికెట్లను అందుబాటులో ఉంచినట్టు తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles