MJ Akbar raped me, says US-based journalist ఎంజే అక్బర్ కామాంధుడే: ఇండో-అమెరికన్ జర్నలిస్ట్ అరోపణ

Metoo former asian age editor pallavi gogoi accuses mj akbar of rape

#MeTooIndia, MJ Akbar, Allegations against MJ Akbar, Ghazala Wahab, India, MeToo in India, MJ Akbar, NPR, Pallavi Gogoi, Priya Ramani, The Asian Age

The chief business editor of US-based National Public Radio (NPR), Pallavi Gogoi has accused Akbar of raping her when she was working with The Asian Age as a 23-year-old.

ఎంజే అక్బర్ కామాంధుడే: ఇండో-అమెరికన్ జర్నలిస్ట్ అరోపణ

Posted: 11/02/2018 12:43 PM IST
Metoo former asian age editor pallavi gogoi accuses mj akbar of rape

మాజీ కేంద్రమంత్రి ఎంజే అక్బర్ పై వస్తున్న లైంగిక వేధింపులు, అత్యాచార ఆరోపణలకు అతడ్ని మేధావి తెరచాటున దాగివున్న పైశాచిక మృగమని.. జర్నలిజం వనంలో మగమృగం అని.. నీతులు చెప్పేందుకే కానీ అచరించని కామాంధుడన్న విమర్శలు వస్తున్నాయి. తెహెల్కా ఎడిటర్ పై రోజుల వ్యవధిలోనే తీసుకన్న చర్యలు మరో వైపు ఎంజే అక్బర్ పై మాత్రం తీసుకోవడంలో మాత్రం ఎందుకు కేంద్రం మీనమేషాలు లెక్కిస్తుందన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి.

అయితే అతనిపై వస్తున్న లైంగిక వేధింపుల అరోపణలకు పలువురు మహిళా జర్నలిస్టులతో తెరపడిందని భావిస్తున్న క్రమంలో మరో మహిళా జర్నలిస్టు అతని అకృత్యంపై సభ్యసమాజానికి తెలియజేయడంతో ఇప్పటికీ తెరపడటం లేదు. పల్లవి గొగొయ్ అనే ఓ ఇండో-అమెరికన్ జర్నలిస్ట్ తాజాగా ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. తాను యుక్తవయస్సులో ది ఏసియన్ ఏజ్ అనే పత్రికలో పనిచేస్తున్న సమయంలో దానికి ఎడిటర్ గా ఉన్న అక్బర్‌ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించారు. వాషింగ్టన్ పోస్ట్‌లో రాసిన వ్యాసంలో పల్లవి ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రస్తుతం నేషనల్ పబ్లిక్ రేడియో(ఎన్‌పీఆర్)కి చీఫ్ బిజినెస్ ఎడిటర్‌గా పనిచేస్తున్న పల్లవి గొగొయ్.. అక్బర్‌తో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వాషింగ్టన్ పోస్టులో వివరంగా రాశారు. తనకు 23ఏళ్ల వయసున్నప్పుడు అక్బర్ తనపై అత్యాచారం జరిపారని, జైపూర్‌లోని ఓ హోటల్లో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపించారు.అక్బర్‌పై పలువురు మహిళా జర్నలిస్టుల లైంగిక ఆరోపణలు ఇటీవలే తన దృష్టికి వచ్చాయని.. ఈ నేపథ్యంలోనే తనకెదురైన చేదు అనుభవాన్ని కూడా అందరితో పంచుకుంటున్నానని ఆమె తెలిపారు.

1994లో ఓ వార్తా కథనాన్ని కవర్ చేయడానికి ఢిల్లీకి కొన్ని వందల మైళ్ల దూరంలో ఉన్న మారుమూల గ్రామానికి వెళ్లానని.. ఆ సందర్భంలో అక్బర్ చేత రేప్‌కు గురయ్యానని పల్లవి వెల్లడించారు. కులాంతర వివాహానికి చెందిన ఓ జంటను గ్రామస్తులు ఉరితీసిన ఘటనకు సంబంధించి ఓ కథనం రాయడానికి అక్కడికి వెళ్లానని గుర్తుచేసుకున్నారు. అదే సమయంలో దాని గురించి చర్చించాలని అక్బర్ తనకు ఫోన్ చేశారని, ఆ మేరకు జైపూర్ లోని ఓ హోటల్లో ఆయన్ను కలిశానని చెప్పారు.

అదే హోటల్ గదిలో తాను ఎంజే అక్బర్ చేతిలో లైంగిక దాడికి గురయ్యానని చెప్పింది. ఎంతగా ప్రతిఘటించినప్పటికీ ఆయన బలం ముందు తాను నిలబడలేక పోయానని.. ఆయనలోని మగమృగం ముందు తాను నిలవలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తన దుస్తులను తొలగించి అక్బర్ అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పారు. ఇక ఆ తరువాత కూడా పలు నెలల పాటు ఆయన తనపై అదే తరహా లైంగిక దాడిని కొనసపాగించారని అమె అవేదన భరితంగా తనపై జరిగిన లైంగికదాడిపై తన అకౌంట్లో పేర్కోంది.

అంతేకాదు ఇక ఆ పత్రికలో తాను పనిచేసినన్నాళ్లు ఆయన తన లైంగికదాడిని కొనసాగించారని, అంతటితో ఆగకుండా ఆయన తాను పనిచేసినన్ని రోజులు మానసికంగా, శారీరికంగా తనపై దాడి చేస్తూనే వున్నారని అమె తన వ్యధను వివరించారు. అయితే తనపై లైంగిక దాడి జరిగిన క్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిపోయి సిగ్గుతో తలదించుకున్నానని, ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోలేకపోయానని చెప్పారు. అంతకుముందు కూడా అక్బర్ తనను లైంగికంగా వేధించారని అందులో వివరించారు. ఇప్పుడింతమంది మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి అక్బర్ చేసిన అఘాయిత్యాలను బయటపెడుతుండటంతో.. తాను సైతం దీన్ని బయటపెట్టాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : #MeTooIndia  MJ Akbar  Ghazala Wahab  NPR  Pallavi Gogoi  Priya Ramani  The Asian Age  

Other Articles