votes abducting gangs in AP tweets Pawan Kalyan రాష్ట్రంలో ఓట్లను గల్లంతు చేసే గ్యాంగులు: పవన్

Votes abducting gangs in ap pawan kalyan on missing votes

Pawan Kalyan, Janasena, Twitter, pawan tweet, Karnataka formation day, East Godavari, Ambati rambabu, YSRCP, Voters list, 60 Lakh votes misising, AP CEO, Ruling party, TDP, Andhra pradesh, politics

Actor turned Politician Jana Sena party President Pawan Kalyan too responded on missing votes issue on twitter, He said we are aware of children abducting gangs but now we see votes abdutcing gangs.

రాష్ట్రంలో ఓట్లను గల్లంతు చేసే గ్యాంగులు: పవన్

Posted: 11/01/2018 03:36 PM IST
Votes abducting gangs in ap pawan kalyan on missing votes

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తొలగించే కార్యక్రమం యథేచ్ఛగా సాగుతోందని వైసీపీ అరోపించిన క్రమంలో ఇదే అంశంపై ఇటు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 60 లక్షల ఓట్లను ప్రభుత్వం తొలగించిందని అంబటి రాంబాబు అరోపించిన నేపథ్యంలో పవన్ కల్యాన్ కూడా ఇదే అంశంపై ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. తనదైన శైలిలో అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు.

ఇప్పటి వరకు దేశంలో చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే గ్యాంగులను చూశామన్ని ఆయన ఇప్పుడు మాత్రం ఓట్లను ఎత్తుకెల్లే గ్యాంగులను చూస్తున్నామని అన్నారు. అయితే దీనిపై టీడీపీ నేతలు ఎప్పుడు, ఎలా స్పందిస్తారో.. ఏం మాట్లాడుతారో అని తాను ఎదురుచూస్తున్నట్లు పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ లో పేర్కోన్నారు. ఇక అంతకుముందు ఆయన కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కన్నడిగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ‘కర్ణాటకలోని సోదర, సోదరీమణులకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.

మరోవైపు పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన ఖరారైంది. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన పవన్ జనసేన సమన్వయ కమిటీలను నియమించడంతో పాటు పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. రేపు శుక్రవారం నుంచి ఆయన తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకూ పవన్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా కాకినాడలోని ఏడు నియోజకవర్గాల్లో పవన్ యాత్ర సాగనుంది. జనసేన కేడర్ ను ఎన్నికలకు సన్నద్ధం చేయడంలో భాగంగా పవన్ యాత్ర చేపట్టనున్నారు.

పర్యటనలో భాగంగా ప్రజలతో పాటు పలువర్గాల ప్రతినిధులు, ప్రజా సంఘాలతో పవన్ ముఖాముఖి సమావేశం అవుతారు. రేపు ఉదయం విజయవాడలోని జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, అన్నవరం, సామర్లకోట మీదుగా పవన్ తునికి చేరుకుంటారు. తొలిరోజు తునిలోని గొల్ల అప్పారావు సెంటర్ లో నిర్వహించే బహిరంగ సభలో జనసేనాని పాల్గొంటారు. నియోజకవర్గాల్లో పర్యటన సందర్భంగా ప్రజలతో నేరుగా మాట్లాడి స్థానిక సమస్యలను తెలుసుకుంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles