CBI DSP Devender Kumar arrested in bribe case సీబిఐ ఉన్నతాధికారుల మధ్య ముడుపుల వార్..

Choas in cbi case filed against deputy sp devendra kumar

Central Bureau of Investigation, CBI, deputy SP, Devender Kumar Singh, bribery allegation, Arrest, CBI Special Director, Rakesh Asthana, meat exporter, Moin Qureshi. middleman, PM Modi, PMO Office, summons, Amit shah, politics

The Central Bureau of Investigation (CBI) arrested deputy SP Devender Kumar Singh amid bribery allegation against Special Director Rakesh Asthana. He was allegedly received bribe from middlemen in a case involving meat exporter Moin Qureshi.

సీబిఐ ఉన్నతాధికారుల మధ్య ముడుపుల వార్.. డిఫ్యూటీ ఎస్పీ అరెస్టు

Posted: 10/22/2018 06:05 PM IST
Choas in cbi case filed against deputy sp devendra kumar

సీబీఐలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. దేశంలోనే అవినీతి వ్యహరాలను దర్యాప్తు చేసే అత్యున్నత సంస్థ సీబీఐ అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. సెంట్రల్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లో ప్రధమ, ద్వితీయ స్థానాల్లో వున్న ఇద్దరు అధికారుల మధ్య పోరపోచ్చాలు రావడం.. దీంతో వారు ఒకరిపై మరోకరు అవినీతి అరోపణలు పాల్పడటం.. నీవు ముడుపులు తీసుకున్నావంటే.. లేదు లేదు.. నీవే ముడుపులు తీసుకుని నాపై అరోపణలు చేస్తున్నావని వాదించుకునే స్థాయికి పరిస్థితి వెళ్లింది.

దేశంలో ఎక్కడ ఏ అవినీతి అధికారికైనా సీబిఐ పేరు చెబితేనే హడలిపోవాల్సిన శాఖకు చెందిన అధికారులే.. 'ముడుపుల' తీసుకున్నారంటూ పరస్పరం అవినీతి ఆరోపణలకు దిగడంతో పాటు పరస్పరం కేసులు నమోదు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ ఈ ఇద్దరు అధికారుల వ్యవహారంలో మరింత వేగంగా పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో సీబిఐ ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం వున్నందున.. శాఖలోని కీలక అధికారులే అవినీతికి పాల్పడ్డారన్న అరోపణలపై పీఎంవో స్పందించింది.

దేశంలోని అనేక అంశాలపై ప్రతిపక్షాలతో పాటు దేశ ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురుచూసినా.. స్పందించని ప్రధానమంత్రి కార్యాలయం.. సీబిఐ అధికారుల వ్యవహారంపై హుటాహుటిన స్పందించింది. అధికారులిద్దరినీ తమ కార్యాలయానికి రావాలని పిలిచిన పీఎంవో.. వారిద్దరితో చర్చరించింది. ఈ వ్యవహిరంలో అధికారులు మధ్య తక్షణ చర్యలకు దిగింది. పీఎంవో అదేశాలకు అనుగూణంగా కాకుండా తమ ఇష్టాఇష్టాలకు అనుగూణంగా వ్యవహరించిన ఇద్దరు సీబీఐ ఉన్నతాధికారులైన అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాలకు సమన్లు పంపింది.
 
మాంసం వ్యాపారి మెయిన్ ఖురేషికి సంబంధించిన కేసులో ఆయనకు ఉపశమనం కలిగించేందుకు మధ్యవర్తి మనోజ్ ప్రసాద్ ద్వారా లంచం తీసుకున్నాడన్న ఆరోపణలపై స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాపై సీబీఐ ఆదివారం లంచం కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆస్థానాతో పాటు, అలోక్ వర్మకు పీఎంఓ సమన్లు పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే వీరికి సమన్లు జారీ చేసిన పీఎంవో వీరిపై ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుంది.. అన్న విషయాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే.
 
సిట్ సీబీఐ డిప్యూటీ ఎస్‌పీ అరెస్టు

కాగా, సీబిఐ స్పెషల్ డైరెక్టర్ రాకేస్ అస్థానాకు షాక్ తగిలింది. ఇవాళ ఉదయం సీబీఐ మరింత దూకుడుగా ముందుకు వెళ్లింది. ఆస్థానాపై ఉన్న లంచం ఆరోపణలకు సంబంధించి సిట్ సీబీఐ డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర కుమార్ ను సీబీఐ అధికారులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ అరెస్టుల పర్వం ఎవరెవరి మెడకు చుట్టుకుంటుందో.. అంటూ దేశప్రజలు ఎదురుచూస్తున్న క్రమంలో ప్రధాన మంత్రి కార్యాలయం స్పందించింది. మనీలాండరింగ్, అవినీతి ఆరోపణలతో సహా పలు కేసులు ఎదుర్కొంటున్న ఖురేషి కేసులో ఆస్థానాతో కలిసి దేవేంద్ర కుమార్ సింగ్ పనిచేస్తున్నారు.

ఇక ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. దేశంలోని ఒక స్వయం ప్రతిపత్తి సంస్థను తమ రాజకీయాలకు అనుగూణంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ వాడుకుంటున్నారని.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే సీబిఐ అధికారులు ఒకరిపై మరోకరు ప్రత్యారోపణలు చేసుకోవడం.. పరస్పరం కేసులు పెట్టుకునే వారకు పరిస్థితి దిగజారిందని అన్నారు. సిబీఐ అధికారులుగా కొనసాగుతున్న అతున్నత స్థాయి అధికారులే లంచాలు తీసుకుంటే ఇక సీబిఐ అర్థం ఏ మేర మారుతుందోనని రాహుల్ ప్రశ్నలను సంధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CBI  Devender Kumar Singh  bribery allegation  Arrest  meat exporter  Moin Qureshi  Crime  

Other Articles