Revanth demands sumoto case on KCR కేసీఆర్ పై సుమోటో కేసుకు రేవంత్ డిమాండ్

Revanth demands sumoto case on kcr quoting nayini comments

Telangana police, Revanth Reddy, sumoto case, nayini, musheerabad, KCR, Home Minister, HM Nayini Narsimha Reddy, Telangana HM Nayini, KCR, Chief Minister, Musheerabad, Srinivas Reddy, telangana early polls, telangana assembly elections, telangana early polls, Hyderabad High Court, DK Aruna, congress, Telangana, Politics

Telangana senior Congress Leader KCR demands police to file a sumoto case on Cheif Minister KCR, based on Home Minister Nayini Narsimha Reddy comments who forced him not to contest from Musheerabad and offered RS 10 Crore money.

నాయిని వ్యాఖ్యలతో కేసీఆర్ పై సుమోటో కేసుకు రేవంత్ డిమాండ్

Posted: 10/13/2018 12:06 PM IST
Revanth demands sumoto case on kcr quoting nayini comments

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా వచ్చిన 2014 అసెంబ్లీ ఎన్నికలలో తాను ముషిరాబాద్ నుంచి బరిలో దిగుతానని చెప్పగా, ఎల్బీనగర్ నుంచి పోటీ చేయాలని.. అందుకు అవసరం అయితే..తనకు పదికోట్లు రూపాయలను కూడా ఇస్తానని సీఎం కేసీఆర్ చెప్పారని మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేయాలని టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, నాయిని నర్సింహారెడ్డి అడిగిన స్థానం ఇవ్వకుండా, అక్కడి నుంచి మారడానికి తనకు కేసీఆర్ పది కోట్ల రూపాయలు లంచం ఇవ్వజూపారని స్వయంగా ఆయనే చెప్పారని అన్నారు.

ఎన్నికల అధికారులు నాయిని నరసింహారెడ్డి బహాటంగా, బహిరంగంగా చేసిన వ్యాఖ్యలను పోలీసులు సుమోటోగా స్వీకరించి కేసీఆర్ పై తక్షణమే కేసు పెట్టి విచారణ చేపట్టాలని రేవంత్ డిమాండ్ చేశారు. కేసీఆర్, ఆయన బంధువు అయిన మైహోమ్ రామేశ్వరరావు నివాసాలపై ఐటీ దాడులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గానికి కనీసం ఇరవై, ఇరవైఐదు కోట్లు ఖర్చు పెట్టేందుకు కేసీఆర్ సిద్ధపడ్డారని, ఐటీ, ఈడీ దాడులు మోదీ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఆరోపించారు.

నోట్ల రద్దు ఎఫిసోడ్ నుంచి కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి, తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వానికి దోస్తి కుదిరిందని విమర్శించారు. అప్పటి నుంచే టీఆర్ఎస్ బీజేపికి బాసిన ప్రభుత్వంగా మారిందని రేవంత్ అరోపించారు. కొడంగల్ వంటి నియోజకవర్గాల్లో వందకోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారని, కోట్ల రూపాయలను ఈరోజు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. వీటన్నింటిపైనా ఎన్నికల అధికారులు నిఘా పెట్టాలని, ఐటీ అధికారులు దాడులు చేయాలని డిమాండ్ చేశారు. నెల రోజులుగా నాయినికి కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని, వెన్నంటి ఉన్న నాయినిని కేసీఆర్ అవమానించారని ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana police  Revanth Reddy  sumoto case  nayini  musheerabad  KCR  Telangana  Politics  

Other Articles