janasena stands for transpirancy in government: pawan జవాబుదారి ప్రభుత్వాల కోసమే జనసేన పుట్టింది: పవన్

Pawan kalyan says janasena stands for transpirancy in government

pawan kalyan, janasena, amaravati, janasena office inauguration, vijayawada, amaravati jana sena office, jana sena amaravati office, pawan kalyan press meet, pawan kalyan vizag tour, pawan kalyan srikakulam tour, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan says state bifurcation had changed may youth lives as they suddenly fall into OC catagory from Backward catagory.

జవాబుదారి ప్రభుత్వాల కోసమే జనసేన పుట్టింది: పవన్

Posted: 10/13/2018 12:42 PM IST
Pawan kalyan says janasena stands for transpirancy in government

విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతల్లో జవాబుదారీతనం లేకుండా పోయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను ఎలాంటి అవగాహన లేకుండా, ప్రజల భవిష్యత్ గురించి ఆలోచించకుండా విభజించారని విమర్శించారు. విభజన చట్టానికి ఆమోదం లభించడంతో రాత్రికి రాత్రి తెలంగాణలో కొన్ని బీసీ కులాలు ఓసీగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రశ్నించేవారే కరువయ్యారని వ్యాఖ్యానించారు.

ఇలాంటి నిర్ణయాల కారణంగా యువత భవిష్యత్తు అర్థరాత్రి నుంచి ప్రశ్నార్థకంగా మారిపోయిందని అవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం పవన్ కల్యాణ్ పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. బీసీలు ఓసీలుగా మారిపోయినా, వందలాది మంది ఉపాధి కోల్పోయినా కేంద్రం నిర్ణయాన్ని ప్రశ్నించేవారే లేకపోయారని పవన్ తెలిపారు. ఈ విషయాలపై అటు రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సి వున్నా పట్టించుకున్నదే లేదని దుయ్యబట్టారు.

అధికారం కోసం ప్రజల జీవితాన్ని అస్తవ్యస్తం చేయకుండా ఉండేందుకు రాజకీయాల్లో జవాబుదారీతనం కోసమే తాను జనసేనను స్థాపించానని వెల్లడించారు. సీఎం కార్యాలయం, మంత్రుల ఇళ్లపై ఢిల్లీలో జరిగినట్లు తనిఖీలు జరిపితే తాము ఏపీ ప్రభుత్వానికి అండగా నిలుస్తామని పేర్కొన్నారు. ఎక్కడో గుంటూరు, కడప జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఫ్యాక్టరీలపై జరిగే వాటిపై తాము స్పందించబోమని తేల్చిచెప్పారు. నాదెండ్ల మనోహర్, తనది ఒకేరకమైన ఆలోచనా విధానమని పవన్ అన్నారు.

ఇక జనసేనలో చేరిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నాదేండ్ల మనోహర్ మాట్లాడుతూ జనసైనికుడిగా కష్టపడి పని చేసేందుకు పార్టీలో చేరానని అన్నారు. పవన్ కల్యాణ్ ఆలోచనా విధానం, అంకిత భావం గురించి, సమాజానికి ఏవిధంగా మేలు చేయాలనే ఆయన తపన గురించి చాలా తక్కువ మందికి తెలుసని అన్నారు. రాజకీయాల్లో అంకిత భావంతో పని చేయాలనే ఉద్దేశ్యం ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారని, అటువంటి వ్యక్తుల్లో పవన్ కూడా ఒకరని కొనియాడారు.

పవన్ అడుగుజాడల్లో నడవడం మనందరి అదృష్టమని అన్నారు. రాజకీయ మార్పుల గురించి ఎవరూ ఊహించలేమని, ఒక్కోసారి మార్పులు లేకుండా అలానే ఉండవచ్చని అభిప్రాయపడ్డ మనోహర్, కన్వీనెంట్ పాలిటిక్స్ ఈరోజు ఎక్కువైపోయాయని, ఒకో పార్టీ, ఒకో నాయకుడు ఒకో విధంగా మాట్లాడుతూ ఉంటారని అన్నారు. ఒకే నాయకుడు నాలుగు ఉపన్యాసాలు చేయాల్సి వస్తే నాలుగు విధాలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏ అంకితభావంతో, విలువలతో అయితే పవన్ రాజకీయాల్లోకి వచ్చారో, వాటిని జనసేన సైనికులందరూ కూడా పుణికిపుచ్చుకోవాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  amaravati  janasena office inauguration  vijayawada  andhra pradesh  politics  

Other Articles