garuda seva for Lord sri varu at tirumala శ్రీవారికి గరుడసేవ.. లలితా త్రిపుర సుందరిగా దుర్గమ్మ..

Kanaka durga devi in lalitha tripura sundari devi avatar today

Kanaka Durga temple, lalitha tripura sundari, Dasara festival celebrations, Vijayawada, Gayatri devi, Navaratri fest, simha vahanam, muthyala pandiri, Garuda Seva, Ghatasthapana, Lord Venkateswara, Navaratri, ‪Muhurta‬‬m, chinna shesha vahanam, Hamsa vahanam, indrakeeladri, Alampur

As a part of Annual Navaratri brahmotsavam, on the fifth day garuda seva is conducted to lord Sri Venkateshwara swamy on sunday, Meanwhile Kanaka Durga devi atop Indrakeeladri hills is in Lalitha Tripura sundari Devi Avatar and blessing devotees.

లలితా త్రిపుర సుందరిగా దుర్గమ్మ.. శ్రీవారికి గరుడసేవ..

Posted: 10/13/2018 11:23 AM IST
Kanaka durga devi in lalitha tripura sundari devi avatar today

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తిరుమల బ్రహోత్సవాలలో భాగంగా నాలుగో రోజైన ఇవాళ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారు ఇవాళ ఉదయం కల్పవృక్ష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రధానం చేశారు. ఇక రాత్రికి సర్వభూపాల వాహనంపై ఊరేగనున్నారు. ఇక బ్రహ్మోత్సవాలలో అత్యంత కీలక ఘట్టమైన గరుడ సేవ ఐదవ రోజైన అదివారం నాడు నిర్వహించనున్నారు.

ఇక ఇంద్రకీలాద్రి కనకదుర్గాదేవి ఆలయంతో పాటు, శ్రీశైల బ్రమరాంభికాదేవీ ఆలయం, శ్రీకాళహస్తిలోని వాయులింగశ్వన ఆలయంతో పాటు పాలమూరు జిల్లా ఆలంపూర్ అమ్మవారి దేవాలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాల్గవ రోజైన శనివారం నాడు దుర్గమ్మవారు భక్తులకు లలితా త్రిపుర సుందరీ దేవి అవతారంలో దర్శనం ఇస్తున్నారు. లలితా త్రిపుర సుందరి దేవికి అర్చక బృందాలు ప్రత్యేక అర్చనలు చేశారు. అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు. పలువురు మహిళా భక్తులు ఆలయాల్లో లలితా సహస్రనామాలను పటించారు.

త్రిపురాత్రయంలో లలితాత్రిపుర సుందరి రెండో శక్తి. దేవీ ఉపాసకులకు ముఖ్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో నాలుగో రోజున దర్శనమిస్తున్నారు. లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్ఠాన శక్తిగా అమ్మ కొలువుదీరింది. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలను అనుగ్రహిస్తోంది. లలితాదేవి విద్యా స్వరూపిణి. మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవి అనుగ్రహం కోసం సువాసినీ పూజ చేస్తారు. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి.

జగన్మాతయే లలితాదేవిగా ఆశ్వయుజ మాసంలో పూజలందుకుంటోంది. ప్రతిప్రాణిలో ఉండే శక్తే చైతన్య స్వరూపిణి ఆదిపరాశక్తి. దీనినే నారాయణీ స్తుతి ‘త్వయైకయా పూరిత మంబయైతత్’ అంటూ ధృవపరిచింది. శివవిష్ణు సహస్ర నామాలకంటే ఒక్కసారి అమ్మను మనసార ధ్యానిస్తే చాలు అపారమైన కరుణ లభిస్తుంది. అమ్మను పూజించినవారికి పునర్జన్మ ఉండదు. ఇక లలితాత్రిపుర సుందరిదేవి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. నాలుగో రోజు భ్రమరాంబదేవి కుష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles