Nagam Janardhan Reddy's Son Passes Away నాగం జనార్థన్ రెడ్డికి పుత్ర వియోగం..

Nagam janardhan reddy s son dinakar reddy passes away

Nagam Janardhan Reddy. Nagam's elder son, Dr. Dinakar Reddy, passed away, heart attack, breathe related problems, transplant his lungs, Apollo Hospital, Dinakar Reddy practising doctor, Dinakar Reddy civil contractor, Telangana

Tragedy has struck senior Telangana leader Nagam Janardhan Reddy. Nagam's elder son Dr. Dinakar Reddy passed away due to heart attack at the Apollo Hospital in Hyderabad last night. Dinakar was 46 years old.

నాగం జనార్థన్ రెడ్డికి పుత్ర వియోగం.. అనారోగ్యంతో దినకర్ కన్నుమూత

Posted: 10/12/2018 01:01 PM IST
Nagam janardhan reddy s son dinakar reddy passes away

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఇంట్లో విషాదం అలుముకుంది. నాగం జనార్థన్ రెడ్డి కుమారుడు దినకర్ రెడ్డి (46) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. వారం రోజుల క్రితం వరకు బాగానే వున్న దినకర్ రెడ్డి అకస్మాత్తుగా అరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు అపోలో అసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

అక్కడ చికిత్స పోందుతున్న ఆయన గురువారం రాత్రి అనంతవాయువులలో విలీనమయ్యారు. స్వతహాగా వైద్యరంగానికి చెందిన నాగం జనార్థన్ రెడ్డి ఎన్టీఆర్ తెలుగుదేశం పట్ల అకర్షితులై ఆయన పార్టీలో చేరి.. అటు వైద్యం ఇటు రాజకీయం ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం రెడింటినీ నిర్వహించారు. తన పెద్ద కుమారుడు దినకర్ రెడ్డిని కూడా వైద్యరంగం మీద మక్కువతో డాక్టరు చదువు చదివించారు. ఆయన కూడా తండ్రి మాదిరిగానే అటు వైద్యంతో పాటు సివిల్ కాంట్రాక్టు పనులు కూడా చేస్తూ ఆయన తీరిక లేని జీవితాన్ని గడిపేవారు.

ఈ క్రమంలో వారం రోజుల క్రితం ఆయన అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడ్డారు. కుటుంబసభ్యులు ఆయనను అపోలో అస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఊపిరితిత్తుల మార్పిడి కోసం వైద్యులు ఏర్పాటు చేస్తుండగానే, గురువారం రాత్రి పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. కుమారుడి మృతితో నాగం కుటుంబం విషాదంలో మునిగిపోయింది. నాగం కుమారుడి మృతి విషయం తెలిసిన కాంగ్రెస్ నేతలు, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తదితరులు ఆసుపత్రికి చేరుకుని నాగంను పరామర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles