IT raids at TDP MP CM Ramesh's places రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ పై ఐటీ దాడులు..

It raids at tdp mp cm ramesh s places in telangana andhra

Rajya Sabha MP CM Ramesh, lawmaker CM Ramesh, CM Ramesh House raid, CM Ramesh, political vendetta, IT Raids, offices, houses, TDP MP CM Ramesh. IT Raids on CM Ramesh, CM Chandrababu, Income Tax raids, Telugu Desam Party (TDP), Hyderabad, Kadapa, Andhra Pradesh

The homes and offices of a lawmaker from Andhra Pradesh Chief Minister N Chandrababu's party were raided by IT officials. Nearly 100 tax officials raided TDP lawmaker CM Ramesh in Hyderabad and Kadapa.

రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ పై ఐటీ దాడులు..

Posted: 10/12/2018 02:15 PM IST
It raids at tdp mp cm ramesh s places in telangana andhra

టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ నివాసాలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్, కడపలో ఉన్న ఆయన నివాసాలకు, కార్యాలయాలకు చేరుకున్న సుమారు 60 మంది ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కడప జిల్లా పోట్లదుర్తిలోని సీఎం రమేష్‌ నివాసంలో సోదాల నిమిత్తం 15 మంది అధికారులు వచ్చినట్టు తెలుస్తోంది. ఆయన సోదరుడి నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి. కాగా, ప్రస్తుతం సీఎం రమేష్ న్యూఢిల్లీలో ఉన్నారు.

కేంద్ర పీఏసీ సభ్యుడిగా ఉన్న ఆయన, దేశంలో ఐటీ దాడులు ఎక్కడ జరుగుతున్నాయి? ఎందుకు చేస్తున్నారు? ఏపీలో జరుగుతున్న దాడుల వివరాలు తెలియజేయాలంటూ, ఆదాయపు పన్ను శాఖకు ఇటీవల ఆయన నోటీసులు పంపించారు. నోటీసులు పంపిన మూడు రోజుల వ్యవధిలోనే రమేష్‌ ఆస్తులపై దాడులు జరగడం గమనార్హం. కేంద్రం చేస్తున్న అన్యాయాలను, కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ప్రశ్నిస్తున్నందునే సీఎం రమేష్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేసి భయపెడుతున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కేంద్రంలోని అధికార బీజేపి పార్టీతో తాము తెగదెంపులు తెంచుకున్న కారణంతో.. తమపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ దాడులకు కేంద్రం పాల్పడుతుందని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు. కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సంస్థలను తన చెప్పు చేతల్లో పెట్టుకుందని ఆయన నిప్పులు చెరిగారు. ఐటీ దాడులపై తాను సమాచారం అడిగిన మూడు రోజుల్లోనే తన ఇంటిపై దాడులకు వచ్చారని, అది కూడా తాను న్యూఢిల్లీలో ఉన్న సమయంలో దాడులకు ఎందుకు పాల్పడటమని ప్రశ్నించారు.

తాను ఇంట్లో వున్న సమయంలో దాడులు చేయవచ్చుకదా.? అని ఆయన ప్రశ్నించారు. ఐటీ దాడులపై నిలదీస్తే.. అదే శాఖను తనపైకి కేంద్రం ఉసిగొల్పిందని దుయ్యబట్టారు. కడప, హైదరాబాద్ లోని తన ఇళ్లకు కార్యాలయాలకు వెళ్లి దాడులు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఆదాయపు పన్ను శాఖకు తాను పన్నులను సక్రమంగా చెల్లిస్తున్నానని, తన కంపెనీలు పూర్తి పారదర్శక లావాదేవీలను నడుపుతాయని ఆయన చెప్పారు. కాగా, ఐటీ అధికారులు మాత్రం ఆస్తుల పత్రాలను, ఇతర డాక్యుమెంట్లను, ఆయన నిర్వహిస్తున్న పలు కాంట్రాక్టులకు చెందిన దస్త్రాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CM Ramesh  IT Raids  offices  houses  political vendetta  Hyderabad  Kadapa  Andhra Pradesh  

Other Articles