Cyclone Titli massively hits srikakulam of Andhra Pradesh సిక్కోలుపై పంజా విసిరిన తిత్లీ.. అతలాకుతలం..

After odisha cyclone titli moves to andhra pradesh no loss of life

India Meteorological Department, 'Titli', Srikakulam, 8 mandals of srikakulam, Uttarandhra, severe syclonic storm, cyclone titli, odisha, Andhra Pradesh, gopalpuram, Kalingapatanam, National Disaster Response Force, CYCLONE

'Titli' intensified into a severe cyclonic storm and is moving towards the Odisha-Andhra Pradesh coast, triggering rainfall in several parts of Odisha, the (IMD) said.

సిక్కోలుపై పంజా విసిరిన తిత్లీ.. అతలాకుతలం..

Posted: 10/11/2018 11:43 AM IST
After odisha cyclone titli moves to andhra pradesh no loss of life

బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాన్ తిత్లీ శ్రీకాకుళం జిల్లాలో బీభత్సం సృష్టిస్తోంది. గురువారం ఉదయం జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం గొల్లపాడు- పల్లిసారథి వద్ద తిత్లీ తుఫాన్ తీరం దాటింది. ఈ సమయంలో గంటకు 140 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులు విధ్వంసం సృష్టించాయి.  గాలులు ఉద్దృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఉద్దానం ప్రాంతంలో కొబ్బరిచెట్లు పెనుగాలులకు ఊగిపోతున్నాయి. కొన్నిచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఉద్దానంతో పాటు సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, పలాస, గార, వజ్రపుకొత్తూరు, సోంపేటలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి.

Cyclone Titli Photos

తుపాను తీవ్రతకు ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, నందిగాం, పలాస, వజ్రపు కొత్తూరు, మెళియాపుట్టి మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇది మరింత బలపడి పెను తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో గురువారం సాయంత్రం వరకు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఆర్టీజీఎస్‌ కేంద్రం తెలిపింది. దీంతో ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో రెడ్ అలెర్ట్ జారీ అయింది.

Cyclone Titli Photos

గాలుల బీభత్సానికి భారీ వృక్షాలు విరిగిపడుతున్నాయి. కొన్ని చోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ప్రమాదాన్ని ఊహించి ముందుగానే ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. గాలి బీభత్సానికి శ్రీకాకుళం జిల్లా బారువ వద్ద పార్కింగ్ చేసిన లారీలు పడిపోయాయి. రోడ్డుపై ఏమీ కనిపించకపోవడంతో 16వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాలన్నీ నిలిచిపోయాయి. కాగా, ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన ఏపీ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా తీరప్రాంత ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించింది. దీనివల్ల ప్రాణనష్టాన్ని అడ్డుకోగలిగింది. అయితే ఆస్తి నష్టం మాత్రం భారీ స్థాయిలోనే ఉందని అధికారులు అంటున్నారు.

శ్రీకాకుళంలో తుఫాన్ పరిస్థిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటి కప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన శ్రీకాకుళం బయలు దేరుతున్నారు. అక్కడ సహాయ, పునరావాస చర్యలను చంద్రబాబు పరిశీలించనున్నారు. రాత్రి శ్రీకాకుళం జిల్లాలోనే సీఎం మరోవైపు విజయనగరంలోని కలెక్టరేట్‌లో కంట్రోల్ రూము ఏర్పాటు చేశారు. ఏదైనా సమస్య ఎదురైతే 08922 236947, టోల్ ఫ్రీ నంబరు 1077కు ఫోన్ చేయాలని అధికారులు ప్రజలను సూచించారు. విశాఖ కలెక్టరేట్‌లో 1800 4250 0002 నంబర్ ను అందుబాటులో ఉంచారు. తుపాన్ ప్రభావం వల్ల చెన్నై-విశాఖపట్టణం-హౌరా మార్గంలో బుధవారం (అక్టోబరు 10) రాత్రి నుంచి పలు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. కొన్ని రైళ్లను దారి మళ్లించారు.

Cyclone Titli Photos

Cyclone Titli Photos

Cyclone Titli Photos

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srikakulam  Uttarandhra  Andhra Pradesh  National Disaster Response Force  titli  IMD  CYCLONE  

Other Articles