Petrol and diesel prices hiked againమళ్లీ పెరిగిన ఇంధన ధరలు..

Petrol and diesel prices hiked again

oil price, crude oil, price hike, petrol, diesel, dharmendra pradhan, goods and service tax, petrol price, diesel price

Fuel prices have been on a continuous rise recently, due to which consumers have taken to social media and other platforms to complain of the additional expense.

మళ్లీ పెరిగిన ఇంధన ధరలు..

Posted: 10/11/2018 12:23 PM IST
Petrol and diesel prices hiked again

పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుకుపోతున్నాయి. ఇప్పటికే ఆల్ టైం రికార్డ్ లను అధిగమించి.. ఇకపై వాటికవే కొత్త రికార్డలను సృష్టించుకుంటూ వాటినవే బద్దులుకొట్టుకుంతూ ముందుకు సాగుతున్నాయి. అమ్మో పెట్రోలు.. అయ్యో డీజిలు అనే స్థితికి వాహనదారులు చేరుకుంటున్నారు. కేంద్రం ఇటీవల రెండున్నర రూపాయల మేర ఎక్సైజ్ సుంఖాన్ని మినహాయించి ఊరట కల్పించినా.. అది చాలా అలస్యంగా తీసుకున్న నిర్ణయంగా, ఫలితమివ్వనిది మారిందంటూ విమర్శలు కూడా వ్యక్తం అయ్యాయి.

ఈ క్రమంలో తాజాగా ఇవాళ ఇంధన ధరలను పెంచింది కేంద్రం. అంతర్జాతీయ మార్కెట్ లో గణనీయంగా పడిపోతున్న రూపాయి మారకం విలువతో.. ధరలను పెంచక తప్పడం లేదని జాతీయ ఇంధన సంస్థలు ప్రకటించాయి. దీంతో గురువారం (అక్టోబరు 11) దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.82.36 కి చేరింది. డీజిల్ ధర 27 పైసలు పెరిగి రూ.74.62 కి చేరింది.

ఇక వాణిజ్య రాజధాని ముంబయిలో 9 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.87.82 కి చేరింది. డీజిల్ ధర 29 పైసలు పెరిగి రూ.78.22 కి చేరింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయాన్నికొస్తే.. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర 25 పైసలు పెరిగి రూ.87.21, డీజిల్ ధర 21 పైసలు పెరిగి రూ.80.61 కి చేరింది. ఉంది. విజయవాడలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.86.25, డీజిల్ ధర రూ.79.32గా ఉంది. పెట్రోల్ ధరలను ఇదే ప్రాతిపదికన పెరుగుతూ పోతే.. త్వరలోనే ఇంధన ధరలు శతకాన్ని కూడా అందుకుంటాయన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles