Lord sri varu on chinna shesha vahanam చిన్నశేష వాహనంపై సంచరించన మలయప్పస్వామి

Kanaka durga devi in bala tripura sundari avatar today

Kanaka Durga temple, Dasara festival celebrations, Vijayawada, bala tripura sundari devi, Navaratri fest, Garuda Seva, Ghatasthapana, Lord Venkateswara, Navaratri, ‪Muhurta‬‬m, chinna shesha vahanam, Hamsa vahanam,

As a part of Tirumala Lord Sri Venkateswara annual Navaratri brahmotsavam the lord Sri Venkateshwara swamy had moved in chinna shesha vahanam, Meanwhile Kanaka Durga devi atop Indrakeeladri hills is in Bala Tripura Sundari Devi Avatar and blessing devotees.

బాలాత్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు..

Posted: 10/11/2018 10:51 AM IST
Kanaka durga devi in bala tripura sundari avatar today

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. తిరుమల బ్రహోత్సవాలలో భాగంగా తొలి రోజున సాయంత్రం పెద్దశేష వాహనంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగించిన శ్రీవారు.. భక్తులకు అభయ ప్రధానం చేశారు. కాగా ఇవాళ తెల్లవారుజూమునే చిన్న శేష వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించిన శ్రీవారు భక్తులకు అభయ ప్రధానం చేశారు. కాగా ఇవాళ సాయంత్రం కలియుగ దైవమైన శ్రీ మలయఫ్ప స్వామి హంసవాహనంపై సంచరిస్తారు.

ఇక ఇంద్రకీలాద్రి కనకదుర్గాదేవి ఆలయంతో పాటు, శ్రీశైల బ్రమరాంభికాదేవీ ఆలయం, శ్రీకాళహస్తిలోని వాయులింగశ్వన ఆలయంతో పాటు పాలమూరు జిల్లా ఆలంపూర్ అమ్మవారి దేవాలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రెండో రోజైన ఇవాళ అమ్మవారు బాలా త్రిపురసుందరిదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. బాలాత్రిపురికి అర్చక బృందాలు ప్రత్యేక అర్చనలు చేశారు. అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు.

తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులను అమ్మవారి దర్శనార్థం అనుమతించారు. రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం లభిస్తుంది. దర్శనానికి కొండ కింద వినాయక గుడి నుండి రెండు క్యూ లైన్ల ద్వారా అనుమతిస్తున్నారు. దుర్గమ్మకు అమెరికాకు చెందిన ఆర్‌ఎక్స్‌ అడ్వాన్స్‌డ్‌ కంపెనీ ఫౌండర్‌ హైక రవి కుటుంబీకులు ఆరు లక్షల 30వేల రూపాయల విలువ చేసే నీలలతో కూడిన బంగారు హారాన్ని సమర్పించారు. ఈ మేరకు ఆ హారాన్ని బుధవారం ఈవో కోటేశ్వరరమ్మకు అందజేశారు. శనివారం అమ్మవారికి అలంకరించాలని వారు కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles