Pawan Kalyan strong warning to chintamaneni టీడీపీపై పవన్ ఫైర్.. రౌడీ ఎమ్మెల్యేకు విఫ్ పదవా.?

Pawan kalyan strong warning to chintamaneni

pawan kalyan, janasena, pawan kalyan porata yatra, pawan kalyan eluru, pawan kalyan denduluru, pawan kalyan west godavari district, pawan kalyan Eluru, eluru yatra, Pawan Kalyan

Actor turned politician Jana Sena chief pawan kalyan warns ruling government to take action against rowdy mlas, and also questions how this mla elected as assembly whip.

చింతమనేనిపై పవన్ ఫైర్.. రౌడీ ఎమ్మెల్యేకు విఫ్ పదవా.?

Posted: 09/26/2018 05:21 PM IST
Pawan kalyan strong warning to chintamaneni

తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో వారి ఎమ్మెల్యేల అగడాలు శృతిమించితున్నాయని, ఇప్పటికైనా వారిని ప్రభుత్వం నియంత్రణలో పెట్టాలని, వారిపై కేసులను శరవేగంగా దర్యాప్తు చేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని తాను పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన సందర్భంలో స్వయంగా చంద్రబాబుకు చెప్పానని.. మరీ ముఖ్యంగా అడపడుచులకు ఏలాంటి హానీ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారని పవన్ చెప్పారు.

అయితే ఓక మహిళా అధికారిని పట్ల అనుచితంగా వ్యవహరించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని వ్యవహారంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏం న్యాయం చేసిందో రాష్ట్ర ప్రజలందరూ చూశారని దుయ్యబట్టారు. బలమైన రాజకీయ వ్యవస్థ వస్తేనే బలమైన పోలీసు వ్యవస్థ వస్తుందని ఆయన చెప్పారు. పోలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థ చేతులు కట్టుకుని కూర్చుంటే.. రాజ్యాంగేతర శక్తులు బయటకు వస్తాయని, ఇది ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం పోలీసు వ్యవస్థ కూడా నిర్వీర్యంగా మారిందని, వారు కూడా అధికార రాజకీయ నాయకులకు ఒత్తాసు పలుకుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.

ఇసుక అక్రమ రావాణ చేస్తున్నారన్న సమాచారంతో అడ్డుకునేందుకు వచ్చిన మహిళా అధికారినిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యేకు అధికార తెలుగుదేశం ప్రభుత్వం చీఫ్ విఫ్ పదవిని కట్టబెట్టి.. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను ఇంకా చేయాలని ప్రోత్సహించిందా.? అని పవన్ ప్రశ్నించారు. చింతమనేని ప్రభాకర్ అంటే చంద్రబాబుకు భయమని.. అందుకనే అతనిపై చర్యలు తీసుకోవడానికి కూడా జంకుతున్నారని విమర్శించారు. స్థానిక పోలీసులు చింతమనేని అంటే భయమని మరి ఎస్సీ, డీఐజీ, డీజీపి, హోం మంత్రి, ముఖ్యమంత్రి, ఆయన కొడుకు నారా లోకేష్ కూడా చింతమనేని అంటే భయమా.? అంటూ ప్రశ్నించారు.

ఇలాంటి రౌడీ ఎమ్మెల్యేల అడగాలు ఇకపై సాగవని హెచ్చరించారు. ఇప్పుడిక జనం కోసం జనసైనికులు వున్నారని.. వారు ఇలాంటి రౌడీ ఎమ్మెల్యేల కొమ్ములు వంచి కూర్చోబెడతారని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 27 కేసుల్లో నిందితుడిగా వున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై చర్యలు తీసుకుంటారా.? లేక జనసేన పార్టీని రోడ్డెక్కమంటారా అంటూ వార్నింగ్ ఇచ్చారు. రాజ్యాంగేతర శక్తులు రాజ్యమేలుతూ సామాన్య ప్రజలను కష్టపెడుతున్నాయని అందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని ఓ మహిళపై ఎమ్మెల్యే దాడి చేస్తే.. మహిళా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని, ఇక మహిళా కమీషన్ ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. విపక్ష పార్టీ నేతలు ఈ చర్యలు చేసివుంటే.. మీకు ఇలాగే చేతులు ముడుచుకుని కూర్చునేవారా.? అంటూ ప్రశ్నించారు. ఇక దళిత కార్మికుడిపై కులం పేరుతో దూషించి.. దాడి చేస్తే దళిత ఎమ్మెల్యేలు కూడా చేతులు కట్టుకుని కూర్చున్నారా.? అని ప్రశ్నించారు. జనసేన అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు బాగా వుడాలని భావిస్తుందని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  west godavari  chintamaneni prabhakar  denduluru  andhra pradesh  politics  

Other Articles