caught on Cam: brutally murder in Hyderabad కొడుకు హత్యకు అత్తాపూర్ నడిరోడ్డుపై తండ్రి ప్రతీకారం

Caught on cam brutally murder in broad day light in hyderabad

father revenge on son's murder, mahesh murder, hyderabad police commissioner, rajendranagar police station, illicit affair old city, illegal affair old city, murder illegal affair, childhood friend murder, ramesh, purohit mahesh, illegal affair ramesh, old city friend murder, illegal affair, crime

A gruesome cold murder in the presence of Traffic police constable is reported from Hyderabad’s Attapur are at pillar no 139. In the video, unknown assailants, brutally hitting a person with an axe until he is no longer alive

అటవిక న్యాయం: కొడుకు హత్యకు నడిరోడ్డుపై తండ్రి ప్రతీకారం..

Posted: 09/26/2018 03:38 PM IST
Caught on cam brutally murder in broad day light in hyderabad

హైదరాబాద్ లో పట్టపగలు మరో దారుణ హత్య సంభవించింది. ఎర్రగడ్డలో తన కూతురు, అల్లుడిపై జరిగిన దాడి కేసును మరువక ముందే నగరంలోని మరో ప్రాంతంలో ఓ తండ్రి తన కోడుకు హత్యకు ప్రతీకారం తీర్చుకున్నాడు. మిట్టమధ్యాహ్నం అందరూ చూస్తుండగా.. అత్యంత దారుణంగా హతుడు ప్రాణాలతో లేడని తెలిసిన తరువాత కూడా మళ్లీ మళ్లీ నరికి ప్రతీకార హత్యకు పాల్పడ్డాడు.  అత్తాపూర్ లో దారుణ హత్య చోటుచేసుకుంది.

పివీఆర్ ఎక్సప్రైస్ హైవే ఫిల్లర్ నెం 143 వద్ద హతుడ్ని అటకాయించిన తండ్రి, ఆయన బావమరుదులు గొడ్డలితో దాదాపు 100 మీటర్లు వెంటాడి వేటాడి మారీ నరికి చంపారు. రక్షించమని మృతుడు ఆర్తనాధాలు పెట్టినట్లు స్థానికులు తెలిపారు. చంపేసి పారిపోతున్న దుండగులను ట్రాఫిక్ పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. నిందితులను రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. హతుడు రమేష్ గౌడ్ గా తెలుస్తుంది. ఓ హత్య కేసు విషయంలో కోర్టుకు హజరై వస్తుండగా ప్రత్యర్థులు వెంబడించి అతిదారుణంగా హతమార్చారు.

పాత కక్ష్యలే కారణంగా నడిరోడ్డుపై ఈ హత్యకు కారణమని తెలుపుకున్నారు పోలీసులు. వివాహితతో అక్రమ సంబంధం నేపథ్యంలో తనకు అడ్డుతగులుతున్నాడని చిన్ననాటి స్నేహితుడు మహేష్ ను హత్యమార్చిన రమేష్.. అదే కేసు వాయిదా విషయంలో ఇవాళ న్యాయస్థానంలో విచారణకు హజరై తిరిగివస్తుండగా మాటు వేసిన మహేష్ తండ్రి, అతని బావమరిది మరో ఇద్దరు వ్యక్తులు.. అతడ్ని 143వ పిల్లర్ వద్ద అటకాయించి.. వెంబడించి మరీ హతమార్చి తన కొడుకు హత్యకు ప్రతీకారం తీర్చుకున్నారు. అయితే ఇది అటవిక న్యాయమన్న విమర్శలు కూడా తెరపైకి వస్తున్నాయి. అందరూ ప్రతీకారాలు తీర్చుకుంటే ఇక చట్టం, న్యాయం అవసరమేంటన్న వాదనలు కూడా వినబడుతున్నాయి.

అక్రమ సంబంధమే హత్యలకు కారణం

హైదరాబాద్ పాతబస్తిలోని జుమ్మెరాత్ బజార్ లో రమేష్, పురోహిత్ మహేష్ అనే ఇరుగుపొరుగింటి యువకులు చిన్ననాటి స్నేహితులు. రమేష్ ఇంట్లో వున్న ఓ గదిలోకి అద్దెకు దిగిన వివాహితతో రమేష్ అక్రమసంబంధం ఏర్పర్చుకున్నాడు. రమేష్ చర్యలను దగ్గరినుంచి చూసిన మహేష్ అదే వివాహితతో చనువుగా వున్నాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పేరిగింది. ఈ నేపథ్యంలో ఇరువురు పరస్పరం వార్నింగ్ లు కూడా ఇచ్చుకున్నారు. వారి మధ్యనున్న స్నేహబంధం కూడా అప్పటి నుంచే తెగిపోయింది.

అయితే రమేష్ అక్రమ సంబంధం విషయాన్ని మహేష్ వివాహిత భర్తతో కూడా చెప్పాడని, దీంతో వారు ఆ ప్రాంతంలోని ఇంటిని ఖాళీ చేసి మరో ప్రాంతానికి వెళ్లిపోయారు. దీంతో మహేష్ పై కక్ష గట్టిన రమేష్.. అతనితో మాట్లాడటం ప్రారంభించాడు. మళ్లీ స్నేహ హస్తం అందించాడు. మహేష్ రమేష్ స్నేహాన్ని పూర్తిగా నమ్మాడు. గత వారం ఇద్దరు మరికొందరు న్నేహితులతో కలసి పార్టీ కూడా చేసుకున్నారు. అదే మాదిరిగా మైసిగండి వద్ద పార్టీ వుందని చెప్పి.. మహేష్ ను తీసుకెళ్లిన రమేష్ ముందస్తుగానే అతన్ని హత్య చేయాలని ప్రణాళిక రచించుకున్నాడు.

మైసిగండి వద్దకు వెళ్లి అక్కడ స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్న తరువాత హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో.. మద్యం సేవించి నిద్రపోతున్న మహేష్ ను చూసి తన వెంట తెచ్చుకున్న కత్తితో మహేష్ గొంతును కోసి హత్య చేశాడు రమేష్. ఈ చర్యతో షాక్ కు గురైన కారులోని మరో ఇద్దరు స్నేహితులు నివ్వెరపోగా, తనకు అన్యాయం చేశాడనే చంపానని రమేష్ వారిని సముదాయింది. దీంతో స్థానికంగా వున్న ఓ పెట్రోల్ బంకు వద్దకు వెళ్లిన అక్కడి నుంచి పది లీటర్ల పెట్రోల్ తీసుకుని వచ్చి.. కొన ఊపరితో కొట్టుమిట్టాడుతున్న మహేష్ ను మదనపల్లి గ్రామ శివార్లలో సజీవదహనం చేశారు.