IT Raids on Revanth Reddy రేవంత్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు

It raids on congress leader revanth reddy houses

Revanth reddy, Telangana ex Mla, congress leader, kodangal ex mla, IT raids, ED sleuths, Telangana, Andhra, TS, AP, Latest, Update, Hyderabad, Kodangal

Income Tax sleuths conducted raids on Congress leader and former Kondagal MLA Revanth Reddy. The officials holding the raids at his houses in Hyderabad, Kondangal and 15 other places.

రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటీ దాడులు.. కాంగ్రెస్ విమర్శలు..

Posted: 09/27/2018 11:36 AM IST
It raids on congress leader revanth reddy houses

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ శాఖ దాడులు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి ఏకకాలంతో ఆయన ఇళ్లు, కార్యకాలయాలు, బంధువలు నివాసాలపై కూడా దాడులు జరుగుతున్నాయి. మొత్తంగా ఆయనకు చెందిన 15 ప్రాంతాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి. ఆస్తి పత్రాలు, భూముల డాక్యుమెంట్లు, వ్యాపార లావాదేవీలు.. ఇత్యాది అంశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. దీంతో పాటు ఈ ఐటీ బృందాలలో ఒక్ ఈడీ అధికారి కూడా ఉన్నట్లుగా సమాచారం

దాడులకు వెళ్లగానే కుటుంబసభ్యుల అందరి ఫోన్లనూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం నుంచి సోదాలు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సోదాల సమయంలో రేవంత్ రెడ్డి ఇంట్లో లేనట్లు సమాచారం. కాగా తనను అరెస్ట్ చేస్తారంటూ ఇటీవల రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయగా.. తాజాగా ఐటీ సోదాలు జరగడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో వున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి ఇంటికి భారీగా అభిమానులు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కాగా, రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ దాడులను చేయించినట్టు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ ధాడులపై తెలంగాణ పీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ‘రాజకీయ కక్షతోనే కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి.. ఎన్నికల సమయంలో పాత కేసులను తిరగదోడి బలమైన కాంగ్రెస్‌ నేతలను అణగదొక్కేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

కేంద్రంలోని బీజేపి ప్రభుత్వంతో చేతులు కలిపి.. కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తున్నారని, జగ్గారెడ్డి, గండ్ర వెంకట్రామణా రెడ్డి, రేవంత్ రెడ్డిలను టార్గెట్ చేస్తున్నారని, ఈ నీచపు ఎత్తుగడలను అనుసరిస్తున్న కేసీఆర్ కు ప్రజలు గుణపాఠం చెబుతారు.. ఐటీ దాడులు టీఆర్ఎస్ చేతకానితనానికి నిదర్శనం.. దీన్ని తీవ్రంగా ఖండిసున్నానని’ అంటూ ఘాటుగా విమర్శించారు. ఇది కేసీఆర్ పిరికితనానికి నిదర్శనం.. తమ పార్టీ నేతలను నేరుగా ఎదుర్కోలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ద్వజమెత్తారు.

కేసీఆర్ నిరంకుశ, నియంతృత్వ‌ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్గించడానికి కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా పోరాడుతుంది’ అని ఉత్తమ్ ట్వీట్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నేతలపై ఐటీ దాడులు పరిపాటిగా మారిందని కాంగ్రెస్‌ నేత వేం నరేందర్‌రెడ్డి విమర్శించారు. రేవంత్‌రెడ్డి నివాసంపై ఐటీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసానికి ఆయన కార్యకర్తలతో సహా చేరుకున్నారు. ఓడిపోతామన్న భయంతోనే కేసీఆర్‌ సర్కారు కాంగ్రెస్‌ ముఖ్య నేతలను టార్గెట్‌ చేస్తోందని ఆయన ఆరోపించారు. సోదాలకు కాంగ్రెస్‌ పార్టీ ఏ మాత్రం భయపడేది లేదన్నారు.

రేవంత్‌రెడ్డి నివాసంలో ఐటీ సోదాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్‌ నేత సీతక్క పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఇళ్లలో దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహించి తమ నిజాయితీని చాటుకోవాలని, కేసీఆర్ బంధువులు, ఆ పార్టీకి చెందిన నేతలపై ఉన్న పాతకేసులపై దర్యాప్తు చేస్తే ఎవరి గుట్టు ఏంటో తెలుస్తుందని విమర్శించారు. కేసీఆర్‌ సర్కారు అణచివేత విధానాలకు పాల్పడుతోందని, కాంగ్రెస్‌ పార్టీని భయపెట్టేందుకు మొన్న జగ్గారెడ్డిని, ఈరోజు రేవంత్‌రెడ్డిని టార్గెట్‌ చేశారని ఆమె ధ్వజమెత్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth reddy  Telangana ex Mla  congress leader  kodangal ex mla  IT raids  ED sleuths  Hyderabad  

Other Articles