Aadhaar Constitutionally Valid, Rules SC మోబైల్ ఫోన్, బ్యాంకు అకౌంట్లకు ఆధార్ అవసరం లేదు

Aadhar is unique needed for pan not for bank mobile

Supreme Court of India,Supreme Court judgement,Supreme Court,SC,dipak misra,Aadhar veridct,Aadhaar Verdict,Aadhaar Act,AADHAAR

The Supreme Court declared Aadhaar scheme as Constitutionally valid. The five-judge Constitution bench said Aadhaar means unique and it is better to be unique than being best.

మోబైల్ ఫోన్, బ్యాంకు అకౌంట్లకు ఆధార్ అవసరం లేదు

Posted: 09/26/2018 01:28 PM IST
Aadhar is unique needed for pan not for bank mobile

ఆధార్ చట్టబద్దమైనదంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఈ క్రమంలో ఎవరూ డూప్లికేట్ ఆధార్ ను పొందలేరని.. పేర్కోన్న అత్యున్నత న్యాయస్థానం.. ఆధార్ వల్ల దేశ పౌరుల వ్యక్తిగత స్వేచ్చకు ఎలాంటి భంగం కూడా వాటిల్లదని పేర్కొంది. ఆధార్ చట్టానికి అనేక మార్పులు చేసిన సుప్రీం.. ఆధార్ డేటాను ప్రైవేటు కంపెనీలు సేకరించేందుకు అనుమతించిన సెక్షన్ 37ను రద్దు చేస్తూ అత్యంత కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది.

దీంతో ప్రభుత్వ పథకాలు వక్రమార్గం పట్టకుండా అర్హులకు పథకాలు చేరుతాయని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.అయితే ఇదే సమయంలో ఆధార్ ను అనుసంధానం తప్పనిసరేమీ కాదని సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. ఆధార్ వివరాల పేరిట ప్రజల నుంచి తీసుకున్న సమాచారం చాలా స్వల్పమేనని అభిప్రాయపడ్డ ధర్మాసనం, బ్యాంకు ఖాతాలు, మొబైల్ నంబర్ల అనుసంధానంకు ఆధార్ అక్కర్లేదని పేర్కొంది. మొబైల్ సంఖ్యకు ఆధార్ తప్పనిసరి చేస్తూ డాట్ (డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికం) పేర్కొనడం రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది.

ప్రైవేటు వ్యక్తులకు, కంపెనీలకు ఆధార్ సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. ఆధార్ అనుసంధానం, ఆధార్ చట్టబద్ధతపై విచారణ జరిపిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది. 38 రోజుల పాటు విచారణ సాగగా, దేశంలోకి చట్ట వ్యతిరేకంగా చొరబడిన వారు ఆధార్ లబ్ధిని పొందకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ఆధార్ చట్టాన్ని మనీ బిల్లుగా ఆమోదించవచ్చని పేర్కొంది. ఆదాయపు పన్ను చట్టంలోని 139ఏఏ ప్రకారం, ఐటీ రిటర్నుల దాఖలు సమయంలో ఆధార్ సంఖ్యను వెల్లడించడం తప్పనిసరని తెలిపింది.

ఇక స్కూల్ అడ్మిషన్ల విషయంలో ఆధార్ పై స్పందిస్తూ, సెక్షన్ 7 కింద స్కూల్ అడ్మిషన్, విద్యార్థికిగానీ, అతని తల్లిదండ్రులకు గానీ దక్కే ప్రయోజనం ఏమీ లేదని, దీనివల్ల ఆధార్ సంఖ్య నమోదు తప్పనిసరేమీ కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆధార్ లేదని స్కూల్లో అడ్మిషన్ ఇవ్వకపోవడం నేరమని పేర్కొంది. సీబీఎస్ఈ, నీట్, యూజీసీ తదితరాలు ఆధార్ ను తప్పనిసరి చేయకుండా ఉండాల్సిందని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aadhar card  constitutional  unique  supreme court  dipak mishra  ak sikri  

Other Articles