congress High command serious on Dy. CM కర్ణాటక ఢిప్యూటీ సీఎంపై కాంగ్రెస్ అధిష్టానం సిరియస్..

Congress high command serious on dy cm who makes his gunman clean his dirty shoes

congress high command, Rahul Gandhi, sonia Gandhi, dycm, deputy chief minister, g parameshwar, gunman, dirty shoe, parameshwar gunman, minister gunman, gunman cleans, minister shoe cleans, minister shoes, karnataka, politics

congress High command serious on karnataka Deputy Chief Minister G. Parameshwar who makes his gunman clean his dirty shoes.

ITEMVIDEOS: కర్ణాటక ఢిప్యూటీ సీఎంపై కాంగ్రెస్ అధిష్టానం సిరియస్..

Posted: 09/06/2018 12:23 PM IST
Congress high command serious on dy cm who makes his gunman clean his dirty shoes

కర్ణాటక ఉపముఖ్యమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్ పై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఆయన తన గన్ మెన్ తో తన చోక్కా తో పాటు షూస్ కూడా తుడిపించుకున్న వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో స్పందించిన కాంగ్రెస్ అధిష్టానం.. ప్రజల మధ్యకు వెళ్లినప్పుడు ఎలా మెలగాలో తెలుసుకోవాలని సూచించిందని సమాచారం. ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా జాగ్రత్తలు వహించాలని కూడా పేర్కొన్నట్లు తెలుస్తుంది.

పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం మానస సరోవర్ యాత్రకు వెళ్లిన క్రమంలో కర్ణాటక రాష్ట్ర వ్యవహారల ఇంచార్జ్ ఈ విషయాన్ని సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అసలేం జరిగిందంటే.. బెంగళూరు నగర పరిధిలోని శివాజీనగర్‌ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పరిశీలనకు అధికారులు తోటి ఎమ్మెల్యేలతో కలసి ఉపముఖ్యమంత్రి పరమేశ్వర్‌ వెళ్ళారు. ఇదే సందర్భంలో బురదలో కాలు పెట్టగా షూతోపాటు కుర్తాకు మట్టి అంటింది.

ఆయన వెంట ఉండే గన్‌మెన్‌ కుర్తాకు ఉండే మట్టిని కింద కూర్చుని శుభ్రం చేయడమే కాక కర్చీఫ్‌తో బూట్లను తుడిచారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలోనే ఉపముఖ్యమంత్రి వ్యవహరించిన విధానం విమర్శలకు కారణమైంది. ఆ వెంటనే డీసీఎం పరమేశ్వర్ ను మీడియా వివరణ కోరగా ఇదో ఇంటర్నేషనల్‌ న్యూస్ గా పరిగణించకండి అంటూ దాటవేశారు. అయితే పరమేశ్వర్‌ బూట్లు తుడిచిన వీడియో వైరల్‌ కావడంతో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం సాగింది. దీంతో పార్టీ అధిష్టానం కూడా సీరియస్ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : congress  High command  serious  Rahul gandhi  Sonia Gandhi  parameshwar  Dy CM  karnataka  politics  

Other Articles