Revanth reddy resigns to mla post ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా..

Revanth reddy resigns as kodangal mla submits letter to assembly secretary

Revanth reddy, revanth reddy resigns as mla, revanth reddy congress, revanth reddy Telangana TDP, Revanth reddy speaker madhusudhana chary, revanth reddy assembly secretary, revanth reddy defected mla, kodangal assembly, vikarabad, resignation, telanagana, politics

TDP MLA Revanth reddy, who defected into Congress recently resigns as kodangal mla today, submits letter to assembly secretary

ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా..

Posted: 09/06/2018 11:41 AM IST
Revanth reddy resigns as kodangal mla submits letter to assembly secretary

అధికార టీఆర్ఎస్ పార్టీపై అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పించే కొడంగల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇవాళ అనూహ్య నిర్ణయం తీసుకుని రాజకీయ వర్గాల్లో విస్మయాన్ని సృష్టించారు. ఆయన ఇవాళ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీని సీఎం కేసీఆర్ రద్దు చేస్తారన్న వార్తల నేపథ్యంలో రేవంత్ తన పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా చేసిన ఆయన తన లేఖ స్పీకర్ మధుసూధనా చారిని అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే స్పీకర్‌ అందుబాటులో లేకపోవడంతో.. అసెంబ్లీ కార్యదర్శికి లేఖను అందించనున్నట్టు సమాచారం. అసెంబ్లీ రద్దు కంటే ముందే తనే రాజీనామా చేయాలనే ఉద్దేశంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలోనే రేవంత్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా.. లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకి అందించారు. అయితే అప్పుడు రేవంత్ రాజీనామా లేఖ అందకపోవడంతో రాజీనామా ఆమోదం పొందలేదు. కాగా, ఇప్పుడు తాజాగా తన రాజీనామాను స్పీకర్ మధుసూధనా చారికి స్పీకర్ ఫార్మెట్ లోనే పంపడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth reddy  kodangal assembly  vikarabad  resignation  telanagana  politics  

Other Articles