Japan hit by strongest storm of 25 years జపాన్ పై ప్రకృతి ప్రళయం.. కుదిపేస్తున్న పెను తుఫాను..

Earthquake in japan amid typhoon jebi powerful 6 7 quake hits hokkaido island

japan, Typhoon Jebi, earthquake, earthquake in japan, Hokkaido, earthquake in Hokkaido, japan news, japan typhoon, japan weather

A powerful earthquake triggered a landslide that engulfed houses on Japan's northern island of Hokkaido early on Thursday, television footage showed, injuring and trapping dozens of people and cutting power to millions across Hokkaido.

ITEMVIDEOS: జపాన్ పై ప్రకృతి ప్రళయం.. అటు పెను తుఫాను.. ఇటు భూకంపం

Posted: 09/06/2018 12:55 PM IST
Earthquake in japan amid typhoon jebi powerful 6 7 quake hits hokkaido island

జపాన్ పై ప్రకృతి కన్నెర్ర చేసింది. ఓ వైపు పెను తుఫాను వస్తుందని గత రెండు రోజులుగా భయాందోళనకు గురైన జపాన్ వాసులను ఇవాళ ఉదయం సంభవించిన శక్తిమంతమైన భూకంపం కుదిపేసింది. హొక్కాయ్ డో దీవిలో ఈ భూకంపం సంభవించింది. ప్రధాన నగరం సప్పోరోకు 68 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదైంది. ఈ భూకంపం ధాటికి పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో దివి మొత్తం విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఆ దీవిలో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ను కూడా స్విచాఫ్ చేశారు. టొమోకొమై సిటీ కేంద్రంగా భూకంపం వచ్చింది.

ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం. మరో 125 మంది తీవ్రంగా గాయపడ్డారు. 20 మంది ఆచూకీ లభించలేదు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు యుద్దప్రాతిపదికన కొనసాగుతున్నాయి. కొండచరియలు విరిగిపడుతుండటంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీవిలో సుమారు 20 లక్షల జనాభా ఉంది. భూకంపంతో సుమారు 125 మంది గాయపడ్డారు. మరో 20 మంది కనిపించకుండాపోయారు. యోషినో జిల్లాలో అయిదుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

ఇప్పటికే జపాన్ ను భయంకర టైపూన్ చుట్టుముట్టింది. గడచిన 25 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత భయంకరమైన టైపూన్ గా దీన్ని ప్రభుత్వం అభివర్ణించింది. గంటకు 216 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు తీర ప్రాంతాల్లోని ప్రజలను భయాందోళనలకు గురి చేస్తుండగా, 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు అలర్ట్ జారీ చేశారు.దీనికి 'జెబీ' అని పేరు పెట్టగా, దీని ప్రభావం జపాన్ ద్వీపమైన శికోకుపై అత్యధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

శికోకులో ఎవరూ ఉండవద్దని హెచ్చరిస్తున్నారు. పోర్ట్ సిటీగా ఉన్న కోబెను ఖాళీ చేసి వెళ్లిపోవాలని, అక్కడ ఒక్కరు కూడా ఉండవద్దని ప్రభుత్వం హెచ్చరించింది. జెబీ దెబ్బకు ప్రతిష్ఠాత్మక యూనివర్సల్ స్టూడియోను మూసివేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. స్టూడియోను తిరిగి ఎప్పుడు తెరుస్తామన్న విషయాన్ని తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. నగోయా, ఒసాకా విమానాశ్రయాలను మూసివేసిన అధికారులు, ఈ నగరాల నుంచి తిరిగే అన్ని విమాన సర్వీసులనూ రద్దు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : japan  Typhoon Jebi  earthquake  Hokkaido  japan typhoon  japan quake  

Other Articles