2 Indian Mujahideen operatives convited ...జంటపేలుళ్ల కేసులో ఇద్దరే దోషులు..

Two convicted 2 acquitted in 2007 hyderabad twin bomb blasts case

Twin Bomb Blast Verdict, nampally metropolitan sessions judge, lumbini park bomb blast, indian mujahideen bomb blast, indian mujahideen, gokul chat blast, hyderabad twin blasts case, hyderabad, crime

Two of the five accused in the twin bombing case of 2007 in Hyderabad were convicted by a special court in Cherlapally central prison here on Tuesday.

జంటపేలుళ్ల కేసులో ఇద్దరే దోషులు..

Posted: 09/04/2018 01:13 PM IST
Two convicted 2 acquitted in 2007 hyderabad twin bomb blasts case

మిని భారతావనిలా బాసిల్లుతున్న హైదరాబాదులో.. అప్పడప్పుడు కొన్ని అలజడులు చోటుచేసుకున్నాయే తప్ప ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా బాంబు విస్పోటనం సంభవించి ప్రశాంతవాతావరణాన్ని విచ్చినం చేసిన జంటబాంబు పేలుళ్ల కేసులో.. ఇవాళ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. ఈ కేసులో అభియోగాలను ఎదుర్కోంటున్న ఐదుగురు నిందితులను విచారించిన న్యాయస్థానం.. కేవలం ఇద్దరిని మాత్రమే దోషులను తేల్చింది.

నిందితులుగా వున్న మరో ముగ్గురిపై ఆధారాలు సరిగ్గా లేవని వారిని నిర్ధోషులగా పేర్కోంది. పదకొండేళ్ల క్రితం హైదరాబాదులో జరిగిన జంట పేలుళ్ల విధ్వంసం కేసులో తీర్పును వెలువరించిన అనంతరం దోషులుగా తేలిన నిందితులకు శిక్షలను రేపు ఖారారు చేయనున్నట్లు తెలిపింది. అనీక్‌ షఫీక్‌, అక్బర్‌ ఇస్మాయిల్‌ను దోషులుగా నిర్థారిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. వీరి శిక్షలను సోమవారం ఖరారు చేయనున్నారు. సరైన ఆధారాలు లేనందున ఫరూఖ్‌ షఫ్రుద్దీన్‌, సాధిక్‌ ఇసార్‌ నిర్దోషులుగా న్యాయస్థానం ప్రకటించింది. మరో ఉగ్రవాది అంజుమ్‌పై తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.

2007 ఆగస్టు 25న లుంబినీ పార్కు, కోఠిలోని గోకుల్‌ఛాట్‌లో విద్రోహ శక్తులు బాంబులు పేల్చిన సంగతి తెలిసిందే. ఆ దుర్ఘటనలో 44 మంది మృతిచెందగా 68మంది పైగా గాయపడ్డారు. ఇండియన్‌ ముజాహిదీన్‌(ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సిట్‌ బృందం తేల్చింది. రియాజ్‌ భత్కల్‌, ఇక్బాల్‌ భత్కల్‌ సహా పలువురిని నిందితులుగా అభియోగపత్రాల్లో పేర్కొంది. వీరిలో అరెస్టయిన ఐదుగురు చర్లపల్లి కారాగారంలో ఉన్నారు. గత నెల 27న తుది విచారణ జరిపిన న్యాయస్థానం ఈరోజు తీర్పు వెలువరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles