Refrain from using 'Dalit': Ministry ఇకపై ‘దళితులు’ అనకూడదు: మీడియాకు మంత్రిత్వశాఖ అదేశం

Stop using the term dalit says government in advisory to media

Information and Broadcasting ministry, dalits, scheduled castes, use of dalit word by media, bombay high court, indian media

Members of the Scheduled Castes can no longer be referred to as Dalits, a new order from the Broadcasting ministry has told television channels.

ఇకపై ‘దళితులు’ అనకూడదు: మీడియాకు మంత్రిత్వశాఖ అదేశం

Posted: 09/04/2018 01:17 PM IST
Stop using the term dalit says government in advisory to media

అగ్రవర్ణాల వారిని ఓసి అని, వెనకబడిన తరగతుల వారిని బిసి అని పిలిచినట్లుగానే షెడ్యూల్‌ కులాలకు చెందిన ప్రజలను ఎస్సీ అనో లేక షెడ్యూల్ కులాల వారు అనో పిలవాల్సిందే తప్ప ‘దళితులు’ అని పిలవొద్దని, అంటూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తాజాగా మీడియా ఛానెళ్లకు అదేశాలను జారీ చేసింది. షెడ్యూల్ కులాల వారి గురించి ప్రస్తావించేప్పుడు దళితులు అనే పదం ఉపయోగించొద్దని సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రైవేటు టీవీ ఛానల్స్‌కు మార్గదర్శకాలు జారీ చేసింది.

బాంబే హైకోర్టు ఇటీవల జారీ చేసిన తాజా ఆదేశాల మేరకు ఈ మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కోంది. షెడ్యూల్‌ కులాల ప్రజలను దళితులు అని పిలవొద్దని, ఆ పదం ఉపయోగించడాన్ని ఆపాలని మీడియాకు సూచించమని ఈ ఏడాది జూన్‌లో బాంబే హైకోర్టు సమాచార మంత్రిత్వ శాఖను అడిగింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఇటీవల మీడియాకు మార్గదర్శకాలు పంపించింది.

దళితులు అనే పదం వాడడాన్ని వ్యతిరేకిస్తూ పంకజ్‌ మేశ్రమ్‌ అనే వ్యక్తి బాంబే హైకోర్టులోని నాగ్‌పూర్‌ బెంచ్‌లో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పదం వాడకుండా ఆపాలని సమాచార మంత్రిత్వ శాఖను ఆదేశించింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు ‘షెడ్యూల్‌ కులాల’ ప్రజలను దళితులు అని పిలవొద్దని, ఆంగ్లంలో ‘షెడ్యూల్‌ క్యాస్ట్‌’ అనే పదానికి స్థానిక భాషల్లో తగిన అనువాద పదం ఉపయోగించాలని స్పష్టంచేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles